- Advertisement -
HomeతెలంగాణCBSE Tenth Results| సీబీఎస్​సీ ఎస్సెస్సీ ఫలితాల్లో ఎస్ఎస్ఆర్ హవా

CBSE Tenth Results| సీబీఎస్​సీ ఎస్సెస్సీ ఫలితాల్లో ఎస్ఎస్ఆర్ హవా

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: CBSE Tenth Results| సీబీఎస్​సీ పదో తరగతి ఫలితాల్లో (CBSE Tenth Results) ఎస్ఎస్ఆర్ డిస్కవరీ పాఠశాల(SSR Discovery School) విద్యార్థులు తమ సత్తా చాటారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల (SSR Educational Institutions) ఛైర్మన్ మారయ్య గౌడ్ మాట్లాడుతూ.. తమ పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. విద్యార్థి కనక్ ఇనాని 476/500 సాధించి జిల్లా టాపర్​గా నిలిచారన్నారు. అలాగే రీచా బజాజ్ 465, సహస్వీ శ్రీరామ్ 451, సంవేద్య 449, సహస్ర 448, శ్రీ వేణు 446, శివ చైతన్య 444, నవ్య 443, కీర్తి రెడ్డి 441 మార్కులు సాధించినట్లు తెలిపారు. అలాగే 24 మంది విద్యార్థులు 90 శాతం కంటే ఎక్కువ మార్కులు, 34 మంది 80 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను సీఈవో హరితగౌడ్, ఉపాధ్యాయులు అభినందించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News