అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy MLA | గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao) అన్నారు. మంగళవారం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన దేవి హాస్పిటల్(Devi Hospital)ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యం అందించేందుకు గైనకాలజిస్ట్, జనరల్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్, డయాబెటిస్ వైద్యులు ఆస్పత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైద్యులు యశ్వంత్ రామచంద్ర, సుప్రీత, మేనేజర్ మహిపాల్, కమిటీ ఛైర్పర్సన్ రజిత వెంకటరామిరెడ్డి, సాయిబాబా, సామెల్, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి, ప్రశాంత్ గౌడ్, అరుణ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
