TG Polycet
TG Polycet​ | ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్​

అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: TG Polycet​ | ​ఉమ్మడి జిల్లాలో పాలిసెట్​ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్​ జిల్లాలో 6,111 మంది హాజరైనట్లు జిల్లా కో–ఆర్డినేటర్​ శ్రీనివాస్​ తెలిపారు. కామారెడ్డిలో 2,766 మంది విద్యార్థులు హాజరయ్యారు. నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya), కామారెడ్డిలో ఎస్పీ రాజేష్​ చంద్ర (SP Rajesh Chandra) పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.