ePaper
More
    HomeతెలంగాణNizamabad collector | ధాన్యం కొనుగోళ్లు సజావుగా చేపట్టాలి

    Nizamabad collector | ధాన్యం కొనుగోళ్లు సజావుగా చేపట్టాలి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Nizamabad collector | ధాన్యం కొనుగోళ్లు సజావుగా చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) అన్నారు. మంగళవారం ఆర్మూర్​లోని ధోబీఘాట్, కమ్మర్​పల్లి మండలం ఉప్లూర్, మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను(Purchase centers) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల(Farmers) నుంచి ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం, మిల్లులకు తరలించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

    ధోబీఘాట్ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని రైతులు కలెక్టర్ దృష్టికి తేగా, నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యానికి తావిచ్చే సొసైటీలకు వచ్చే సీజన్​లో కేంద్రాలను కేటాయించవద్దని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన వెంట ఆర్డీవో రాజాగౌడ్, డీఎస్​వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయ్స్​ డీఎం శ్రీకాంత్ రెడ్డి, డీసీవో శ్రీనివాస్, డీపీఎం సాయిలు, తదితరులున్నారు.

    More like this

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...