KGBV Non-Teaching Workers
KGBV Non-Teaching Workers | సమ్మె నోటీసులిచ్చిన కేజీబీవీ నాన్​టీచింగ్ వర్కర్స్

అక్షరటుడే, ఇందూరు: కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలకు నిరసిస్తూ కేజీబీవీ నాన్​టీచింగ్​ వర్కర్లు సమ్మెకు దిగనున్నారు. ఈనెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నారు. ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ (KGBV Non-Teaching Workers) యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్ తెలిపారు. మంగళవారం డీఈవో కార్యాలయంలోని (DEO Office) ఏడీ నాగజ్యోతికి సమ్మె నోటీసులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు శాపంగా మారిన నాలుగు లేబర్ కోడ్​లకు (Labor codes) వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. తక్షణమే కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలన్నారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత (Health safety) కల్పించాలని, కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్​ కార్మికులందరిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుమలత, నాయకులు రాధ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.