Virat-Kohli
Virat Kohli | నాలుగైదు సెంచ‌రీలు చేస్తాన‌న్న కోహ్లీ స‌డెన్‌గా ఇలా రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌డానికి కార‌ణం?

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Virat Kohli | ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ Virat kohli టెస్ట్‌ల‌కి రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అద్భుతమైన బ్యాటింగ్‌, కెప్టెన్సీతో సుదీర్ఘ ఫార్మాట్‌పై తనదైన ముద్ర వేసిన కింగ్.. ఫేర్‌వెల్ లేకుండానే రిటైర్ కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఉన్న పళంగా కోహ్లీ ఎందుకు రిటైర్‌మెంట్(Retirement) ప్రకటించాడు. మంచి ఫామ్, ఫిట్‌నెస్ ఉన్నా ఆటకు వీడ్కోలు చెప్పాల్సిన అవసరం ఏం వచ్చిందనే ప్రశ్నలు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కోసం కోహ్లీ స‌న్న‌ద్ధం అవుతుండ‌గా, కౌంటీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడట. ఇంగ్లండ్‌‌‌‌లో ఇండియా తరఫున రెండు మ్యాచ్‌లు కూడా ఆడాలనే కోహ్లి ఫిక్సయ్యాడు. ఈ సిరీస్‌లో కనీసం నాలుగైదు సెంచరీలు బాది బ్యాక్ టు ఫామ్‌కి రావాలని కోహ్లి దృఢ సంకల్పంతో ఉన్నాడట.

Virat Kohli | అత‌ని వ‌ల్లేనా?

ఇంగ్లండ్‌తో రెండు ఇండియా ఏ మ్యాచ్‌లు కూడా ఆడతానని చెప్పాడు. 2018లో జరిగిన రంజీ మ్యాచ్‌లలో ఎలా పర్ఫార్మ్ చేశానో.. అలానే ఇంగ్లండ్ సిరీస్‌(England series)లో నాలుగైదు సెంచరీలు నమోదు చేస్తానంటూ కోహ్లి కాన్ఫిడెంట్‌గా చెప్పాడుంటూ ఢిల్లీ రంజీ క్రికెట్ కోచ్ శరణ్‌దీప్ సింగ్ చెప్పారు. అయితే స‌డెన్ గా కోహ్లీ రిటైర్‌మెంట్‌కి సంబంధించి అనేక ప్ర‌శ్న‌లు తలెత్తుతున్నాయి. హెడ్ కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ Ajit Agarkar కారణమని నెట్టింట రూమర్స్ వస్తున్నాయి.విరాట్ అంటే గౌతీకి అసూయ అని అందుకే అతడ్ని బయటకు పంపేశాడని సోషల్ మీడియా(Socia Media)లో నెటిజన్స్ అంటున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓడినందుకు రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని రిటైర్ అయ్యేలా చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కుట్ర‌తోనే సీనియ‌ర్ ప్లేయ‌ర్స్‌(Senior Players)ని బ‌య‌ట‌కి పంపించేస్తున్నార‌నే టాక్ నడుస్తుంది. రాహుల్ ద్రవిడ్ హయాంలో ప్లేయర్లు అద్భుతంగా రాణించారని.. గంభీర్ కోచింగ్‌లో వాళ్ల కాన్ఫిడెన్స్ దెబ్బతిందని, దీనికి తోడు అతడి పాలిటిక్స్ నచ్చకే బయటకు వ‌చ్చేస్తున‌న్నార‌నే టాక్స్ వినిపిస్తున్నాయి. గంభీర్ Gambhir హయాంలో వరుసగా 2 సిరీస్‌లు కోల్పోయాం, డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరుకోలేకపోయాం, ముగ్గురు అత్యుత్తమ ఆటగాళ్లు జట్టును వీడారు.. ఇదీ అతడి ఘనత అంటూ దుయ్యబడుతున్నారు. మ‌రి దీనిపై గంభీర్ ఏమైన స్పందిస్తాడా అనేది చూడాలి. కాగా కోహ్లీ టీ 20లకి కూడా రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం వ‌న్డేల‌లోనే కొన‌సాగ‌నున్నాడు.