ePaper
More
    HomeసినిమాPVR Cinemas | న‌ష్టాల ఊబిలో పీవీఆర్ సినిమాస్​..

    PVR Cinemas | న‌ష్టాల ఊబిలో పీవీఆర్ సినిమాస్​..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :PVR Cinemas | కరోనా త‌ర్వాత థియేట‌ర్స్(Theaters) ప‌రిస్థితి దారుణంగా మారింది. ప్రేక్ష‌కులు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. మ‌రోవైపు ఓటీటీ(OTT)ల‌కి జ‌నాలు బాగా అల‌వాటు ప‌డ‌డంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లే కాకుండా మల్టిప్లెక్స్ థియేటర్లకూ(Multiplex Theaters) కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా పీవీఆర్ ఐనాక్స్ PVR Inox సంస్థ గడిచిన మూడు నెలల కాలంలో ఏకంగా రూ. 125 కోట్ల నష్టం వచ్చినట్టు ప్రకటించింది. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని సంస్థ తన వ్యాపారాన్ని విస్తరిస్తూ పోతున్న నేప‌థ్యంలో అంత న‌ష్టాలు వ‌స్తుండ‌డంతో ఒక్క‌సారిగా ఆలోచ‌న‌లో ప‌డ్డారు. ఇటీవల కాలంలో 11 స్థలాలలో 77 కొత్త స్క్రీన్స్ ను పీవీఆర్ ఐనాక్స్ ప్రారంభించింది. మొత్తం మీద 352 సినిమా సెంటర్స్ తో 1743 థియేటర్లను ఇది 111 సిటీస్ లో నిర్వహిస్తోంది.

    PVR Cinemas | ప‌రిస్థితి దారుణం..

    విస్తరణ వేగవంతంగా సాగుతున్నా కూడా నష్టాల ఊబి నుండి ఆ సంస్థ బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఏదో మంచి హిట్ సినిమా లేదంటే కాస్త ప్ర‌జాద‌ర‌ణ సినిమాలు వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే కాస్త లాభాలు వ‌స్తున్నాయి. ఇతర సమయాల్లో థియేటర్లకు జనాలను తీసుకు రావడంలో ఫెయిల్ అవుతోంది. ఆ రకంగా గడిచిన త్రైమాసికంలో రూ. 125 కోట్ల లాస్ వచ్చిందని ప్రకటించింది. పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం, విడుదలైన సినిమాలు Cinemas ఆశించిన స్థాయిలో ఆడకపోవడమే ప్ర‌ధాన కార‌ణంగా చెబుతున్నారు. మూడో త్రైమాసికంగా నిజానికి సంస్థకు రూ. 35.5 కోట్ల లాభం వచ్చింది.

    ఇప్పుడు ఆదాయం పాతిక శాతం పడిపోయి నష్టాలను అందుకుంది. సినిమాల విడుదల గడిచిన మూడు మాసాల్లో 14 శాతం తగ్గిందని సంస్థ పేర్కొంది. గత త్రైమాసికంలో రూ. 1,759.1 కోట్ల రెవెన్యూ రాగా, ఈ త్రైమాసికంలో కేవలం రూ. 1,311.2 కోట్లు మాత్రమే వచ్చింది. అయితే… ఈ గడ్డుకాలాన్ని ఎదుర్కొనడానికి పీవీఆర్ ఐనాక్స్ ఖర్చులను చాలా వరకూ తగ్గించుకుంటూ వ‌స్తున్నారు. గడిచిన మూడు నెలలో రూ. 1,712.8 కోట్లు ఖర్చు కాగా తాజా మూడు నెలల్లో 13.67 శాతాన్ని తగ్గించుకుని కేవలం రూ. 1,478.7 కోట్లనే ఖర్చు పెట్టింది. ఆ రకంగా లాభనష్టాలను జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ, దానికి అనుగుణంగా పీవీఆర్ ముందుకు సాగుతుంది. ఒక్క పీవీఆర్ కాదు, మిగ‌తా థియేట‌ర్ theater యాజ‌మాన్యాల‌ది కూడా ఇదే ప‌రిస్థితి.

    Latest articles

    Anil Ambani | రూ.17 వేల కోట్ల మోసం.. అనిల్​ అంబానీని విచారిస్తున్న ఈడీ అధికారులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anil Ambani | ప్రాముఖ వ్యాపారవేత్త, రిలయన్స్​ గ్రూప్​ ఛైర్మన్​ అనిల్​ అంబానీ మంగళవారం...

    Vijayanagaram | ట్యూష‌న్‌కి వ‌చ్చిన ఎనిమిదేళ్ల‌ బాలిక‌పై మాస్టార్ అత్యాచార య‌త్నం.. సాహ‌సం చేసి త‌ప్పించుకున్న బాలిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vizianagaram | మానవత్వాన్ని మంటగలిపే ఘటన విజయనగరం జిల్లాలో (Vijayanagaram district) చోటు చేసుకుంది....

    Heroine Hansika | హీరోయిన్ విడాకుల రూమ‌ర్స్.. ఇన్‌స్టాలో పెళ్లి ఫొటోలు డిలీట్ చేయ‌డంతో వచ్చిన క్లారిటీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heroine Hansika | ఇటీవలి కాలంలో సినీ ప్రపంచంలో విభేదాలతో విడాకులు తీసుకుంటున్న జంటల...

    Free Bus Scheme | ఏపీలో ఉచిత బ‌స్సు ప్ర‌యాణంపై కీల‌క అప్‌డేట్.. ఎవ‌రు అర్హులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం(Andhra Pradesh Government) మహిళల కోసం మరో...

    More like this