ePaper
More
    HomeతెలంగాణNizamabad City | గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్

    Nizamabad City | గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ :Nizamabad City | వేల్పూర్, ఆర్మూర్ ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ పోలీసులు(Excise Police) అరెస్టు చేశారు. ఎక్సైజ్ సీఐ వెంకటేష్(Excise CI Venkatesh) తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి వేల్పూర్ గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న యశ్వంత్​ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 750 గ్రాముల గంజాయి, బైకు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆర్మూర్ పట్టణంలో తనిఖీలు చేపట్టి గంజాయి విక్రయిస్తున్న షేక్ సమీర్, షేక్ కలీమ్​ను అరెస్టు చేశారు. వారి నుంచి 2.3 కిలోల గంజాయితోపాటు రెండు బైకులు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఎక్సైజ్ ఎస్సై నరసింహ చారి, సిబ్బంది భూమన్న, గంగారాం, విష్ణు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...