ePaper
More
    Homeబిజినెస్​Pre market analysis | గ్లోబల్‌ మార్కెట్లలో జోరు.. అయినా గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌...

    Pre market analysis | గ్లోబల్‌ మార్కెట్లలో జోరు.. అయినా గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ..

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Pre market analysis : యూఎస్‌(US), చైనాల మధ్య తాత్కాలికంగా టారిఫ్‌ల తగ్గింపు ఒప్పందం కుదరడంతో గత ట్రేడింగ్‌ సెషన్‌(Trading session)లో వాల్‌స్ట్రీట్‌ పరుగులు తీసింది. యూరోప్‌ మార్కెట్లు కూడా లాభాలతో ముగిశాయి. మంగళవారం హంగ్‌సెంగ్‌(Hangseng) మినహా ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గానే స్పందిస్తున్నాయి. సోమవారం నాస్‌డాక్‌(Nasdaq) 4.35 శాతం పెరగ్గా.. ఎస్‌అండ్‌పీ 3.28 శాతం లాభపడిరది. కాగా మంగళవారం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ మాత్రం స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి. మన మార్కెట్లు సోమవారం భారీ ర్యాలీ తీసిన నేపథ్యంలో మంగళవారం ఉదయం ప్రాఫిట్‌ బుకింగ్‌(Profit booking)కు అవకాశం ఉంది.

    Pre market analysis : లాభాల బాటలో యూరోప్‌ మార్కెట్లు

    యూరోప్‌ మార్కెట్లు(Europe markets) సోమవారం లాభాలతో ముగిశాయి. సీఏసీ 1.35 శాతం పెరగ్గా.. ఎఫ్‌టీఎస్‌ఈ 0.58 శాతం, డీఏఎక్స్‌(DAX) 0.29 శాతం లాభపడ్డాయి.

    Pre market analysis : పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు..

    హాంగ్‌కాంగ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ మినహా మిగతా ఆసియా(Asia) మార్కెట్లు మంగళవారం లాభాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో నిక్కీ(Nikkei) 1.7 శాతం లాభంతో ఉండగా.. తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 1.25 శాతం, స్ట్రెయిట్‌ టైమ్స్‌ 0.5 శాతం, కోస్పీ 0.16 శాతం లాభంతో కదలాడుతున్నాయి. షాంఘై ఫ్లాట్‌గా ఉంది. హంగ్‌సెంగ్‌ 1.46 శాతం నష్టంతో కొనసాగుతోంది. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.60 శాతం నష్టంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్‌డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Pre market analysis : గమనించాల్సిన అంశాలు..

    ఎఫ్‌ఐఐ(FII)లు తిరిగి నికర కొనుగోలుదారులుగా మారారు. గత ట్రేడింగ్‌ సెషన్‌లో నికరంగా రూ. 1,246 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. డీఐఐ(DII)లు సైతం రూ. 1,448 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు. క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 61.77 డాలర్లకు చేరింది.

    ఇండియా విక్స్‌(VIX) గణనీయంగా తగ్గింది. సోమవారం 14.98 శాతం తగ్గి, 18.39కుి చేరింది. ఇది మార్కెట్లలో స్థిరత్వాన్ని సూచిస్తుంది. నిఫ్టీ పుట్‌ కాల్‌ రేషియో(PCR) 0.94 నుంచి 1.29కు చేరింది. ఇది బుల్స్‌కు అనుకూలం. రుతుపవనాలు ముందస్తుగానే వచ్చే అవకాశాలున్నాయని ఐఎండీ(IMD) పేర్కొంది.

    భారత్‌ (Bharath)-పాక్‌ల మధ్య సీజ్‌ ఫైర్‌ ఒప్పందం కుదరడంతో జియో పొలిటికల్‌ టెన్షన్స్‌ కాస్త తగ్గాయి. అయితే పాక్‌ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

    యూఎస్‌, చైనా(China)ల మధ్య టారిఫ్‌ల తగ్గింపుపై తాత్కాలిక ఒప్పందం కుదిరింది. ఇరు దేశాలు పరస్పరం 115 శాతం టారిఫ్‌లు తగ్గించుకోవడానికి అంగీకరించాయి. వివిధ దేశాల మధ్య ట్రేడ్‌ డీల్స్‌(Trade deals)లో పురోగతికితోడు మన ఆర్థిక స్థిరత్వం మార్కెట్లను ముందుకు నడిపిస్తుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...