అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pakistan Drone attack : భారత్, పాక్ మధ్య సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ చర్చలు ముగిసిన కొద్దిసేపటికే దాయాది దేశం మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
జమ్మూకశ్మీర్ సాంబా సెక్టార్‌లో పాకిస్తాన్ నుంచి డ్రోన్లు దూసుకొచ్చాయి. వాటిని భారత క్షిపణి రక్షణ వ్యవస్థ నేలకూల్చింది. ప్రస్తుతం సాంబా సెక్టార్‌లో బ్లాక్ అవుట్ అమలు చేస్తున్నారు.
ఇక, భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్వేగ, ఆవేశ పూరిత ప్రసంగం తర్వాత పంజాబ్ సరిహద్దులోనూ బ్లాక్ అవుట్ ప్రకటించారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.