ePaper
More
    Homeక్రీడలుIPL 2025 | ఆర్‌సీబీకి బిగ్ షాక్.. గాయంతో ఆ మ్యాచ్ విన్నర్ దూరం!

    IPL 2025 | ఆర్‌సీబీకి బిగ్ షాక్.. గాయంతో ఆ మ్యాచ్ విన్నర్ దూరం!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్ రీస్టార్ట్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి (royal challengers bangalore) బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, మ్యాచ్ విన్నర్ జోష్ హజెల్ వుడ్ (josh hazlewood) మళ్లీ భారత్‌కు తిరిగి రావడం సందేహంగా మారింది. ప్రస్తుతం హజెల్ వుడ్ భుజానికి గాయం కావడంతో బాధపడుతున్నాడు. డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ (WTC 2025 finel) నేపథ్యంలో అతను రెస్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. జూన్‌లో ఇంగ్లండ్ (englanad) వేదికగా జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో సౌతాఫ్రికాతో ఆస్ట్రేలియా (south africa vs australis) తలపడనుంది. ఆస్ట్రేలియా జట్టుకు హజెల్ వుడ్ ప్రధాన పేసర్. ఈ క్రమంలోనే అతని విషయం‌లో రిస్క్ తీసుకోవద్దని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది.

    ఒకవేళ హజెల్ వుడ్ (josh hazlewood) భారత్‌కు తిరిగి రాకపోతే ఆర్‌సీబీ‌కి (RCB) ఎదురు దెబ్బే. ఈ సీజన్‌లో హజెల్ వుడ్ 18 వికెట్లతో ఆర్‌సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. భుజానికి గాయం కారణంగానే మే 3న చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌కు (chennai super kings) దూరంగా ఉన్నాడు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌ను (IPL 2025 season) ఓ వారం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

    ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ఐపీఎల్‌ 2025 సీజన్‌ను (IPL 2025 season) తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ (BCCI) సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం (central governament) నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈ నెల 16 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు (IPL matches) మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ టోర్నీలో 12 లీగ్ మ్యాచ్‌లతో పాటు 4 ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు జరగాల్సింది. ఈ రీషెడ్యూల్ త్వరలోనే విడుదల చేస్తామని బీసీసీఐ ప్రకటించింది.

    Latest articles

    Inter student | కొత్త చీర కొనివ్వలేదని.. చీరతోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Inter student : నేటి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అతి కష్టం మీద తమ...

    Dial 100 | మద్యం మత్తులో డయల్​ 100కు కాల్​.. కఠినంగా స్పందించిన పోలీసులు.. నాలుగు రోజుల జైలు శిక్ష

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dial 100 : డయల్​ 100 అంటే.. అత్యవసర పరిస్థితులలో పోలీసులను సంప్రదించేందుకు ఉపయోగించే హెల్ప్‌లైన్...

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    Helmet | హెల్మెట్​ బదులు పాల క్యాన్​ మూత.. పెట్రోల్​ బంకు​ సీజ్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helmet : మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని ఇండౌర్​(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర...

    More like this