అక్షరటుడే, వెబ్‌డెస్క్: Russia S-500 | ఆపరేషన్ సిందూర్ (operation sindoor) తర్వాత భారత్– పాకిస్తాన్ (india-pakistan) మధ్య తీవ్రస్థాయిలో దాడులు ప్రతిదాడులు చేసుకున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి (pahalgam terror attack) ప్రతీకారంగా భారత్ పీవోకే, పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్‌పై భారీ సంఖ్యలో డ్రోన్లు, యుద్ధ విమానాలు, క్షిపణులతో దాడులు చేసింది. భారత మిలటరీ స్థావరాలే (india military camps) లక్ష్యంగా దాయాది దేశం యత్నించింది.
Russia S-500 | అడ్డుకున్న సుదర్శన చక్ర
పాకిస్తాన్ దాడులను (pakistan attacks)భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ –400 (S – 400) అడ్డుకుంది. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్ 400 రక్షణ వ్యవస్థ, ఆకాశ్ క్షిపణులు పాక్ దాడుల (pakistan drone missile attacks) నుంచి మనల్ని కాపాడాయి. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను (drones and missiles) ఎస్ 400 రక్షణ వ్యవస్థ సాయంతో భారత్ మధ్యలోనే కూల్చి వేసింది. ఈ క్రమంలో రష్యా భారత్ ముందు మరో ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. ఎస్ 400కు అప్డేట్ వర్షన్ (S-400 update version) అయిన ఎస్–500 రక్షణ వ్యవస్థను (S-500 air defense system) భారత్‌తో కలిసి తయారు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. దేశీయంగా వీటిని తయారు చేద్దామని ప్రతిపాదించినట్లు సమాచారం.
Russia S-500 | అడ్వాన్స్డ్ వర్షన్..
ఎస్-400 కంటే ఎక్కువ సామర్థ్యంతో ఎస్-500ను రూపొందించారు. శత్రుదేశాలు ప్రయోగించే అన్ని రకాల ఆయుధాలను ఇది అడ్డుకోగలదు. రష్యా (russia) ప్రస్తుతం తన కొత్త S-500 వైమానిక రక్షణ వ్యవస్థపై ప్రయోగాలు చేస్తోంది. గతంలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించిన (PM modi russia visit) సమయంలో ఈ వ్యవస్థను సంయుక్తంగా తయారు చేయాలని రష్యా ప్రతిపాదించింది. ఈ ఒప్పందం కుదిరితే.. అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ కలిగిన దేశాల సరసన భారత్ చేరుతుంది.
Russia S-500 | ఎలా పనిచేస్తుందంటే..
ఎస్ –400 రక్షణ వ్యవస్థ (S-400 defence system) 400 కిలోమీటర్ల దూరంలో నుంచే విమానం, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేయగలదు. భారత్ ఈ వ్యవస్థకు ‘సుదర్శన్ చక్ర’ అని పేరు పెట్టింది. రష్యా నుంచి వీటిని భారత్ కొనుగోలు చేసింది. మూడు ఎస్–400 లను భారత్‌కు రష్యా అప్పగించింది. అయితే ఎస్ –500 వ్యవస్థ (S-500 defence system) ఫైటర్‌జెట్స్, క్రూయిజ్ మిసైల్స్, హైపర్‌సానిక్ మిసైల్స్, శత్రుదేశ నిఘా ఉపగ్రహాలను కూడా కూల్చివేయగలదు. భూమి మీద నుంచి 200 కిలోమీటర్ల పైన ఉన్న లక్ష్యాలను ఇది ధ్వంసం చేస్తోంది. 600 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై ఇది దాడి చేయగలదు. మాక్ 20 వేగంతో వస్తున్న 10 టార్గెట్స్‌ను ఇది ఒకేసారి అడ్డుకోగలదు.