ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిWrestling competitions | ఆకట్టుకున్న కుస్తీ పోటీలు

    Wrestling competitions | ఆకట్టుకున్న కుస్తీ పోటీలు

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Wrestling competitions | లింగంపేట మండలం ఐలాపూర్‌లో దుర్గమ్మ ఉత్సవాల్లో భాగంగా సోమవారం కుస్తీ పోటీలు (wrestling competitions) నిర్వహించారు. పోటీల్లో తలపడేందుకు మహారాష్ట్ర, కర్ణాటక, జుక్కల్, బాన్సువాడ, పిట్లం, గాంధారి, తదితర ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చారు. పోటీలు చూసేందుకు జనం కూడా అధికసంఖ్యలో వచ్చారు. విజేతకు మూడు తులాల వెండి కడియం బహుమతిగా అందజేశారు.

    నిజాంసాగర్​లో..

    అక్షరటుడే, నిజాంసాగర్‌: మండలంలోని వడ్డేపల్లిలో నల్ల పోచమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చి తలపడ్డారు. పోటీలు ఆద్యంతం అలరించాయి. విజేతకు రూ.3వేల నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు, గ్రామపెద్దలు ప్రజాపండరి, అంజయ్య, రాజారాం, మోహన్‌ రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    IPO | ఈ వారంలోనూ ఐపీవోల జాతర.. పబ్లిక్‌ ఇష్యూకు పది కంపెనీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | దేశీయ స్టాక్ మార్కెట్‌లో పబ్లిక్ ఇష్యూల(Public issues) జాతర కొనసాగుతోంది. ఈ...

    raping patient in hospital | ప్రైవేట్ ఆసుపత్రిలో యువతిపై అత్యాచారం ఆరోపణ.. మేల్ నర్సు అరెస్టు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: raping patient in hospital | కరీంనగర్ Karimnagar నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స...

    Silver Price Today | బంగారం ధర ఆల్‌టైమ్ హై.. సిల్వర్​ పరిస్థితి ఏమిటంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Silver Price Today | దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. భౌగోళిక...