అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Sand Mining | అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను మోపాల్ మండలం కాస్బాగ్ తండాలో పట్టుకున్నారు. మోపాల్ ఎస్సై యాదాగౌడ్ కథనం ప్రకారం.. బాడ్సి వాగు నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు కాజ్బాగ్ తండాలో తనిఖీలు చేపట్టారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ట్రాక్టర్ల యాజమానులైన దుర్గయ్య, సురేందర్, పీర్ సింగ్లపై కేసు నమోదు చేశారు. ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
