VDC Dichpalli | సాంఘిక బహిష్కరణ చేశారు.. న్యాయం చేయండి
VDC Dichpalli | సాంఘిక బహిష్కరణ చేశారు.. న్యాయం చేయండి

అక్షరటుడే, డిచ్‌పల్లి: తమను వీడీసీ సభ్యులు గ్రామం నుంచి సాంఘిక బహిష్కరణ (Social exclusion) చేశారని, న్యాయం చేయాలంటూ డిచ్‌పల్లి(Dichpalli) మండలం మిట్టాపల్లి(Mittapalli)కి చెందిన 8 కుటుంబాలు వాపోయాయి. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్​ అంకిత్​కు (Additional Collector Ankit) ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గతేడాది గణేష్‌ నిమజ్జనం సందర్భంగా తంగేళ్ల కిషన్, మాసిపేది శ్రీనివాస్‌ మధ్య వాగ్వాదం జరిగిందని, దీంతో ఇది మనసులో పెట్టకుని తమ 8 కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారన్నారు. ఈ విషయమై డిచ్‌పల్లి సీఐ మల్లేష్(Dichpally CI Mallesh), ఎస్సై షరీఫ్‌కు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని, తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు చెప్పారు. కార్యక్రమంలో తేలు గణేష్, మాసిపెది శ్రీనివాస్, తేలు గంగాధర్, రవి, నర్సయ్య, రాజేశ్వర్, గంగారాం, గోపీచరన్‌ ఉన్నారు.