e Passport
e Passport | ఈ–పాస్​పోర్టు సేవలు ప్రారంభం.. ఎక్కడో తెలుసా..

అక్షరటుడే, వెబ్​డెస్క్: e Passport | కేంద్ర ప్రభుత్వం ఈ–పాస్​పోర్టు e Passport సేవలను ప్రారంభించింది. దేశంలోని ప్రధానమైన 12 నగరాల్లో ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికుల భద్రత, వేగవంతమైన సేవలు, నకిలీ పాస్​పోర్టుల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ఈ–పాస్​పోర్టు సేవలను అందుబాటులోకి తెచ్చింది. మొదట 12 నగరాల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్‌లు, బయోమెట్రిక్ డేటా ఇందులో పొందుపరుస్తారు.

e Passport | ఆ 12 నగరాలు ఇవే..

చెన్నై, జైపూర్, హైదరాబాద్, నాగపూర్, అమృత్​సర్​, గోవా, భువనేశ్వర్, జమ్మూ, షిమ్లా, రాయపూర్, సూరత్, రాంచి నగరాల్లో ఈ‌‌–పాస్​పోర్టు విధానం ప్రారంభించారు. ఇన నుంచి ప్రయాణికులు ఆయా ప్రాంతాలో ఈ–పాస్​పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చిప్​ ఆధారిత ఈ–పాస్​పోర్టులతో నకిలీ పాస్​పోర్టులకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఇమ్మిగ్రేషన్​ సమయం Immigration తగ్గుతుంది.

e Passport | ఉపయోగాలు ఏంటంటే..

అధునాతన ఈ–పాస్​పోర్టుతో మెరుగైన భద్రత Improved security, వేగవంతమైన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ అందించవచ్చు. ఈ విధానాన్ని చెన్నైలో గతంలోనే ప్రారంభించారు. ఈ-పాస్‌పోర్ట్ సాంప్రదాయ పాస్‌పోర్ట్‌ను పోలి ఉన్నప్పటికీ, అదనపు భద్రత, సాంకేతికతతో కూడిన చిప్​ ఉంటుంది. ఆ చిప్​లో ప్రయాణికుడి వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. వేలిముద్రలు biometric, ఐరిస్ iris​ స్కాన్​లతో సహా అందులో ఉంటాయి. దీంతో నకిలీ పాస్​పోర్టులు తయారు చేయడం కుదరదు. ఈ డాటా డిజిటల్ ఎన్‌క్రిప్షన్ ద్వారా సురక్షితంగా ఉంటుంది. ట్యాంపరింగ్​ చేయడానికి వీలు లేకుండా రూపొందించారు.

ఈ-పాస్‌పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయాలలో త్వరిత, ఆటోమేటెడ్ గుర్తింపు ధృవీకరణను అనుమతిస్తుంది. దీంతో ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో వేచి ఉండే సమయం తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఇమ్మిగ్రేషన్ గేట్‌లతో అనుకూలంగా ఉంటాయి.