అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Legal Services Authority | భారతీయ న్యాయ చట్టాలపై (Indian legal codes) ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి (District Legal Services Authority) ఉదయభాస్కర్రావు అన్నారు. చట్టాలు సామాన్యులకు సైతం అర్థమయ్యేలా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని బుద్ధ విహార్(Timmapur Buddha Vihar)ను సోమవారం సందర్శించారు. అనంతరం గ్రామంలో న్యాయచట్టాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. లోక్ అదాలత్లో రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరిస్తారని వివరించారు. రాజీమార్గమే.. రాజమార్గమన్నారు. లోక్ అదాలత్లో సమస్యలు పరిష్కరించుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని వివరించారు. కార్యక్రమంలో మోక్షానంద స్వామీ, తిమ్మాపూర్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.