ePaper
More
    Homeబిజినెస్​F&O investors | నష్టపోతున్నా.. తగ్గేదేలే!.. రిటైల్‌ ఇన్వెస్టర్లలో ఎఫ్‌అండ్‌వోపై తగ్గని మోజు

    F&O investors | నష్టపోతున్నా.. తగ్గేదేలే!.. రిటైల్‌ ఇన్వెస్టర్లలో ఎఫ్‌అండ్‌వోపై తగ్గని మోజు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : F&O investors | ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (Future and Option)పై రిటైల్‌ ఇన్వెస్టర్లలో (retail investors) మోజు తగ్గడం లేదు. భారీగా నష్టపోతున్నా.. లాభాలపై ఆశతో జూదమాడుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన సెబీ(SEBI).. కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది.

    ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌ (F&O trading) చేస్తున్న వారిలో 90 శాతానికిపైగా నష్టపోతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇందులో ప్రధానంగా రిటైల్‌ ఇన్వెస్టర్లే (Retail investors) ఎక్కువగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో చిన్న మదుపరుల సంపదను కాపాడేందుకు సెబీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. నష్ట భయం ఎక్కువగా ఉండే ఈ ట్రేడింగ్‌(Trading)కు రిటైల్‌ ఇన్వెస్టర్లను దూరంగా ఉంచేందుకోసం గతేడాది నవంబర్‌లో పలు చర్యలు చేపట్టింది. అయినా కూడా చిన్న మదుపరులు పెద్దగా వెనక్కి తగ్గలేదని గణాంకాలు చెబుతున్నాయి.

    READ ALSO  IT Refund | ఐటీఆర్‌ రిఫండ్‌.. ఇక గంటల్లోనే..!

    ఆ నేపథ్యంలో డిసెంబరు నుంచి మార్చి వరకు మూడేళ్ల కాలంలో నమోదైన గణాంకాలను సెబీ పరిశీలించింది. గతేడాది డిసెంబర్‌నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఈక్విటీ డెరివేటివ్స్‌ (Equity derivatives)లో ట్రేడింగ్‌ చేస్తున్న వారి సంఖ్య గతేడాది ఇదే కాలంతో పోల్చితే 12 శాతం తగ్గినా.. రెండేళ్ల క్రితం అంటే 2022 డిసెంబరు-2023 మార్చితో పోలిస్తే 77 శాతం పెరిగినట్లు గుర్తించింది. ఇదే సమయంలో ప్రీమియం (Premium) పరంగా చూస్తే ఇండెక్స్‌ ఆప్షన్లలో వ్యక్తిగత మదుపరుల ట్రేడింగ్‌ పరిమాణం 5 శాతం తగ్గింది.

    నోషనల్‌ లావాదేవీలూ (notional transactions) 16 శాతం తగ్గాయి. కాగా రెండేళ్ల క్రితంతో పోలిస్తే మాత్రం ప్రీమియం లావాదేవీలు 34 శాతం, నోషనల్‌ లావాదేవీల పరిమాణం 99 శాతం పెరగడం గమనార్హం. కఠిన చర్యలు తీసుకుంటున్నా రిటైల్‌ ఇన్వెస్టర్లలో (retail investors) ఎఫ్‌అండ్‌వోపై మోజు తగ్గకపోవడంతో మరిన్ని చర్యలు తీసుకునేందుకు సెబీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మదుపరుల పెట్టుబడులకు రక్షణ కల్పించడం, మార్కెట్లలో స్థిరత్వం(Market stability) కల్పించాలన్న లక్ష్యాలతో ఈ చర్యలు ఉంటాయని భావిస్తున్నారు.

    READ ALSO  Stock Market | ట్రంప్ ఎఫెక్ట్ నుంచి తేరుకున్నా.. నష్టాల్లోనే ముగిసిన సూచీలు

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this