అక్షరటుడే, వెబ్‌డెస్క్ : DGMO Meeting | భారత్, పాకిస్తాన్ డెరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆఫరేషన్స్ (DGMO) చర్చలు ముగిశాయి. సాయంత్రం ఐదు గంటలకు ఇరు దేశాల డీజీఎంవోలు హాట్‌లైన్ hotline ద్వారా చర్చించారు. సుమారు గంట పాటు వివిధ అంశాలపై వారు చర్చించారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి pahalgam terror attack తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
ఆపరేషన్ సిందూర్ operation sindooor కు ప్రతీకారంగా భారత్‌లోని ప్రాంతాలపై పాకిస్తాన్ దాడులకు యత్నించింది. అయితే భారత గగనతల రక్షణ వ్యవస్థ పాక్ దాడులను తిప్పికొట్టింది. దాయాది దేశం ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను మధ్యలోనే కూల్చివేసింది. అనంతరం భారత్ కూడా పాకిస్తాన్‌లోని ఎయిర్‌బేస్‌లు, మిలిటరీ స్థావరాలపై భారీ స్థాయిలో విరుచుకుపడింది. ఈ క్రమంలో శనివారం ఇరుదేశాల డీజీఎంవోలు చర్చించి కాల్పుల విరమణ ceasefireకు అంగీకరించారు. శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది.
కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా కొద్ది గంటలకే పాక్ ఉల్లంఘించింది. మళ్లీ డ్రోన్లతో దాడులకు తెగబడింది. అయితే భారత్ పాక్ దాడులను తిప్పి కొట్టింది. ఈ క్రమంలో సోమవారం మళ్లీ చర్చించాలని ఇరుదేశాల డీజీఎంవోలు నిర్ణయించారు. మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైంది. భారత్ తరఫున డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ చర్చల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో పాక్దాడులు, కాల్పుల విరమణ గురించి ఆయన చర్చించినట్లు సమాచారం. అయితే రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. ఈ మీటింగ్‌లో జరిగిన అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.