అక్షరటుడే, కోటగిరి: Nizamabad | మటన్ ముక్క ఒకరి ఊపిరి ఆగిపోవడానికి కారణమైంది. గొంతులో ఇరుక్కుపోవడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కోటగిరి మండలంలో సోమవారం చోటు చేసుకుంది. కోటగిరి ఎస్సై సునీల్ (Kotagiri SI Sunil) తెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్ (Nasrullabad) మండలం బొప్పాస్పల్లి గ్రామానికి చెందిన రుత్వాన్ తారాసింగ్(48) కోటగిరి మండలంలోని సుద్దులం తండాలో ఓ శుభకార్యానికి హాజరయ్యాడు. అయితే విందులో భాగంగా భోజనం చేస్తుండగా మటన ముక్క గొంతులో ఇరుక్కుంది. దీంతో వాంతులు కాగా.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రుత్వాన్ తారాసింగ్ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.