అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | భారత్, పాకిస్థాన్‌ల మధ్య సీజ్‌ఫైర్(Cease fire)కు అంగీకారం కుదిరి, ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) సోమవారం జెట్ స్పీడ్‌లో దూసుకుపోయాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నాలుగేళ్ల రికార్డును బద్దలు కొడుతూ పైకెగిశాయి. సెన్సెక్స్(Sensex) 3.74 శాతం, నిఫ్టీ 3.82 శాతం లాభపడ్డాయి. ఒక రోజులో ఇంతలా పెరగడం నాలుగేళ్ళ తరువాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. సోమవారం ఉదయం సెన్సెక్స్ 1,349 పాయింట్ల భారీ గ్యాప్‌అప్‌తో ప్రారంభమై పైపైకి దూసుకెళ్లింది. ఇంట్రాడే(Intraday)లో గరిష్టంగా 3,041 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 412 పాయింట్ల లాభంతో ప్రారంభమై ఇంట్రాడేలో గరిష్టంగా 936 పాయింట్లు లాభపడింది. చివరికి సెన్సెక్స్ 2,975 పాయింట్ల లాభంతో 82,429 వద్ద, నిఫ్టీ(NIfty) 916 పాయింట్ల లాభంతో 24,924 వద్ద స్థిరపడ్డాయి. భారత్(Bharath), పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, యూఎస్- చైనాల మధ్య సుంకాల తగ్గింపునకు ఒప్పందం కుదరడం, యూకే(UK) – భారత్‌ల మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ కుదరడం, స్వేచ్ఛా వాణిజ్యం కోసం చర్చలు పురోగతిలో ఉండడంతో మార్కెట్లు పాజిటివ్‌గా స్పందించాయి.
బీఎస్‌ఈ(BSE)లో 3,545 కంపెనీలు లాభపడగా 576 స్టాక్స్ మాత్రమే నష్టపోయాయి. 133 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 110 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 48 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 12 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్ సర్క్యూట్(Lower circuit)ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ రూ. 16 లక్షల కోట్లకుపైగా పెరిగింది.
Stock Market | అన్ని రంగాల్లో దూకుడు..
అన్ని సెక్టార్ల(All sectors)లో ర్యాలీ కనిపించింది. ఒకదానికొకటి పోటీ పడుతూ ఇండెక్స్‌లు దూసుకుపోయాయి. బీఎస్‌ఈ ఫోకస్డ్ ఐటీ(IT) ఇండెక్స్ అత్యధికంగా 6.74 శాతం పెరిగింది. రియాలిటీ 5.87 శాతం, ఇన్‌ఫ్రా 5.53 శాతం, మెటల్ 5.24 శాతం, పవర్ ఇండెక్స్ 4.82 శాతం లాభపడ్డాయి. ఎనర్జీ(Energy), పీఎస్‌యూ, బ్యాంకెక్స్, ఆటో, క్యాపిటల్ గూడ్స్, టెలికాం ఇండెక్స్‌లు 3 శాతానికిపైగా లాభంతో ముగిశాయి. ఆయిల్ అండ్ గ్యాస్, కన్జూమర్ డ్యూరెబుల్స్, ఎఫ్‌ఎంసీజీ(FMCG) రంగాల షేర్లూ విశేషంగా రాణించాయి. బీఎస్‌ఈ లార్జ్ క్యాప్ ఇండెక్స్ 3.83 శాతం పెరగ్గా.. స్మాల్ క్యాప్(Small cap) 4.18 శాతం, మిడ్ క్యాప్ 3.85 శాతం లాభపడాడ్డాయి.
Top Gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్ -30 ఇండెక్స్‌లో 28 కంపెనీలు లాభాలతో ముగియగా 2 కంపెనీలు మాత్రమే నష్టపోయాయి. ఇన్ఫోసిస్(Infosys) అత్యధికంగా 7.91 శాతం పెరిగింది. హెచ్‌సీఎల్ టెక్ 6.35 శాతం, టాటా స్టీల్ 6.16 శాతం పెరిగాయి. ఎటర్నల్, టెక్ మహీంద్రా(Tech Mahindra), టీసీఎస్ ఐదు శాతానికిపైగా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, రిలయన్స్, అదానిపోర్ట్స్, ఎల్‌టీ(LT), ఎంఅండ్‌ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్ నాలుగు శాతానికిపైగా లాభపడ్డాయి.
Losers..
ఇండస్ ఇండ్ బ్యాంక్(Indusind bank) 3.57 శాతం పడిపోగా.. సన్ ఫార్మా 3.56 శాతం క్షీణించింది.