Mining
Mining | చెరువును తోడేస్తున్నారు.. యథేచ్ఛగా నల్లమట్టి తరలింపు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mining | ఇటుక బట్టీల కోసం చెరువులో నుంచి అక్రమంగా నల్లమట్టి తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. రైతులు(Farmers) పొలాల్లో మట్టి వేసుకుంటే నానా యాగి చేసే.. అధికారులు వారం రోజులుగా చెరువులో జేసీబీలు పెట్టి మట్టి తరలిస్తున్నా పట్టించుకోవడం లేదు.

Mining | అడ్డుకున్న గ్రామస్థులు

మోపాల్(Mopal)​ మండలం మంచిప్ప చెరువులో వారం రోజులుగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. మండలంలోని నర్సింగ్​ పల్లి, సిర్పూర్​, ఒడ్డెర కాలనీ, ముదక్​పల్లి గ్రామాల్లో గల ఇటుక బట్టీ(Brick kiln)లకు మట్టి తరలిస్తున్నారు. 24 గంటల పాటు తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో విసిగిపోయిన గ్రామస్థులు సోమవారం తవ్వకాలను అడ్డుకున్నారు. అయితే తవ్వకాలు చేపడుతున్న వారు గ్రామస్థులనే బెదిరించడం గమనార్హం. తవ్వకాలు ఆపేది లేదని.. ఏమైనా చేసుకోండని వారు బెదిరించినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.

Mining | నిత్యం వందకుపైగా ట్రిప్పుల మట్టి తరలింపు

మంచిప్ప చెరువులో నాలుగు జేసీబీ(JCB)లతో నిత్యం తవ్వకాలు చేపడుతున్నారు. నిత్యం సుమారు వందకుపైగా ట్రిప్పుల మట్టి అక్రమంగా తరలిస్తున్నారు. టిప్పర్ల(Tippers) రాకపోకలతో రోడ్డు ధ్వంసం అవుతుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కాగా మట్టి తవ్వకాల విషయంలో గ్రామస్థులు తహశీల్దార్​, ఆర్డీవో, అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని వారు తెలిపారని గ్రామస్థులు చెబుతున్నారు. కాగా ఎమ్మెల్యే అనుచరులు, పలువురు కాంగ్రెస్​ నాయకులు(Congrss Leaders) ఈ దందాకు తెరలేపినట్లు సమాచారం. అందుకే అధికారులు అటువైపు వెళ్లడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.