ePaper
More
    Homeఅంతర్జాతీయంTrump Tariffs | అన్నీ మంచి శకునములే..

    Trump Tariffs | అన్నీ మంచి శకునములే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Trump Tariffs | అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత(Economic uncertainty) పరిస్థితులు ఒక్కటొక్కటిగా కుదుటపడుతున్నాయి. చిక్కుముడులు విడిపోతుండడంతో మార్కెట్లు కోలుకుంటున్నాయి. ట్రంప్‌ టారిఫ్‌(Trump tariffs)ల ప్రభావం తగ్గుతుండడం, వివిధ దేశాల మధ్య ట్రేడ్‌ డీల్స్‌ కుదురుతుండడం, భారత్‌(Bharath), పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, యుద్ధ విరమణ కోసం రష్యా, ఉక్రెయిన్‌ చర్చలకు ముందుకు రావడంతో ప్రస్తుతం అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి.

    Trump Tariffs | తొలగిన యుద్ధ భయాలు..

    భారత్‌ – పాక్‌(Pak)ల మధ్య యుద్ధ మేఘాలు అలుముకోవడంతో గతవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఒత్తిళ్లకు లోనయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోళ్లలో వెనక్కి తగ్గకపోయినా.. యుద్ధ భయాలతో రిటైల్‌ ఇన్వెస్టర్లు(Retail investors) అమ్మకాలకు పాల్పడడంతో స్టాక్స్‌ పడిపోయాయి. అయితే వారాంతంలో ఇరు దేశాల మధ్య సీజ్‌ ఫైర్‌(Cease fire) ఒప్పందం కుదరడం, ఆదివారం రాత్రి సరిహద్దుల్లో ప్రత్యర్థి దేశంనుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు కనిపించకోవడంతో సోమవారం మన స్టాక్‌ మార్కెట్లు(Stock markets) భారీ లాభాలతో సాగుతున్నాయి.మరోవైపు పాక్‌ కవ్వింపు చర్యలతో మన దేశ సైనిక శక్తి, ఆయుధ సామర్థ్యం మరోసారి ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఇదే సమయంలో చైనా(China) ఆయుధాలు, డిఫెన్స్‌ వ్యవస్థ ఎంత నాసిరకమో స్పష్టమయ్యింది. పాక్‌ వినియోగించిన యూఎస్‌ తయారీ యుద్ధ విమానాన్నీ మన రక్షణ వ్యవస్థ అడ్డుకుని, కూల్చడంతో ఆయుధ వ్యాపారం కొత్త దిశలో సాగే అవకాశాలున్నాయి. ఇది మన డిఫెన్స్‌ కంపెనీలకు పాజిటివ్‌ అంశం. ప్రపంచంలోని చాలా దేశాలు మన ఆయుధాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. దీంతో మన ఎగుమతులూ(Exports) పెరుగుతాయని ఆశిస్తున్నారు.

    Trump Tariffs | భారత్‌ – యూకేల మధ్య ఒప్పందం!

    భారత్‌ – యూకే(UK)ల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. స్వేచ్ఛా వాణిజ్యం దిశగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇది మన మార్కెట్లకు సానుకూలాంశం.
    ట్రంప్‌ ప్రారంభించిన టారిఫ్‌ వార్‌(Tariff war) సైతం తుది దశకు చేరుకుంటోంది. యూఎస్‌ – యూకేల మధ్య కూడా ఈ వారాంతంలో వాణిజ్య చర్చలు జరగనున్నాయి. యూఎస్‌(US), చైనాల మధ్య సైతం త్వరలో ట్రేడ్‌ అగ్రిమెంట్‌ కుదిరే అవకాశాలున్నాయి. ట్రేడ్‌ డీల్‌కు ఇరు దేశాలు సుముఖత వ్యక్తం చేయడంతో గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి.

    Trump Tariffs | క్యూ 4 రిజల్ట్స్ అదుర్స్..

    మన కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలు(Q4 results) ఆశాజనకంగా ఉన్నాయి. చాలా కంపెనీలు మంచి రిజల్ట్స్‌ పోస్ట్‌ చేస్తుండడంతో ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతోంది. ప్రధానంగా పాక్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు(FII) ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లపై నమ్మకంతోనే ఉన్నారు. గత 17 ట్రేడింగ్‌ సెషన్లలో వారు 16 సార్లు నెట్‌ బయ్యర్లు(Net buyers)గా నిలవడం దీనిని రుజువు చేస్తోంది. మరోవైపు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు దూకుడు కొనసాగిస్తున్నారు. ఇదే ఊపు కొనసాగితే మన సూచీలు త్వరలోనే ఆల్ టైం పైకి చేరుతాయని భావిస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...