Stock Market | సీజ్ ఫైర్ ఎఫెక్ట్..భారీ లాభాల్లో సూచీలు
Stock Market | సీజ్ ఫైర్ ఎఫెక్ట్..భారీ లాభాల్లో సూచీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | భారత్‌(Bharath), పాక్‌ల మధ్య అలుముకున్న యుద్ధ మేఘాలతో గతవారం డీలా పడిన మన స్టాక్‌ మార్కెట్లు.. ఇరు దేశాల మధ్య కుదిరిన సీజ్‌ఫైర్‌(Cease fire) ఒప్పందంతో సోమవారం ఒక్కసారిగా రాకెట్‌ వేగంతో పైకి దూసుకువెళ్లాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత(International economic uncertainty) పరిస్థితులూ కుదుటపడుతుండడం సైతం కలిసి వచ్చింది. దీంతో అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 1,349 పాయింట్ల భారీ గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. యుద్ధ భయాలు తొలగడంతో పైపైకి ఎగబాకుతోంది. ఇంట్రాడేలో గరిష్టంగా 2,376 పాయింట్లు లాభపడింది. 412 పాయింట్ల భారీ లాభాలతో ప్రారంభమైన నిఫ్టీ సైతం గణనీయంగా పెరిగింది. ఇంట్రాడే(Intraday)లో గరిష్టంగా 729 లాభపడింది. ఉదయం 12.55 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 2,480 పాయింట్ల లాభంతో, నిఫ్టీ(NIfty) 770 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. ఇన్‌ఫ్రా, పవర్‌, పీఎస్‌యూ స్టాక్స్‌ భారీ లాభాల దిశగా సాగుతున్నాయి. వొలటాలిటీ ఇండెక్స్‌(VIX) 3.87 శాతం తగ్గి 17.76 వద్ద ఉంది. దీంతో మార్కెట్లు స్థిరంగా పెరుగుతున్నాయి. మార్కెట్లలో జోష్ తో బీఎస్ఈ లో మదుపరుల సంపద విలువ ఇంట్రాడేలో రూ. 11 లక్షల కోట్లకు పైగా పెరిగింది.

Stock Market | అన్ని రంగాల్లో జోరు..

బీఎస్‌ఈలో అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి. ఇన్‌ఫ్రా(Infra) ఇండెక్స్‌ అత్యధికంగా 4.79 శాతం పెరిగింది. పవర్‌ ఇండెక్స్‌ 4.1 శాతం, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, పీఎస్‌యూ(PSU) ఇండెక్స్‌లు 3 శాతానికిపైగా లాభంతో కొనసాగుతున్నాయి. ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో తదితర సెక్టార్లు 2 శాతానికిపైగా లాభంతో కదలాడుతున్నాయి. బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌(Small cap) సూచీ 3.84 శాతం పెరగ్గా.. మిడ్‌, లార్జ్‌ క్యాప్‌ సూచీలు కూడా 3 శాతానికిపైగా లాభంతో ఉన్నాయి.

Top Gainers..

బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 28 కంపెనీలు లాభాలతో సాగుతుండగా.. 2 కంపెనీలు మాత్రమే నష్టాలతో ఉన్నాయి. ఎటర్నల్‌(Eternal) అత్యధికంగా 5 శాతం లాభపడగా.. అదాని పోర్ట్స్‌, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్(Infosys) 4 శాతానికి పైగా పెరిగాయి. ఎన్టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 3.5 శాతానికిపైగా లాభంతో, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌(Reliance), పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా మూడు శాతానికిపైగా లాభంతో కొదలాడుతున్నాయి.

Top Losers..

సన్‌ఫార్మా(Sunpharma) 3.53 శాతం నష్టంతో, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 2 శాతం నష్టంతో ఉన్నాయి.