ePaper
More
    HomeతెలంగాణMLC Kavitha | రూ.20 వేల కోట్లు నొక్కేసిన సీఎం.. ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు

    MLC Kavitha | రూ.20 వేల కోట్లు నొక్కేసిన సీఎం.. ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLC Kavitha | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి CM Revanth Reddyపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత MLC Kavitha సంచలన ఆరోపణలు చేశారు. కాంట్రాక్టర్ల నుంచి సీఎం భారీగా కమీషన్లు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. 16 నెలల్లో కాంగ్రెస్​ ప్రభుత్వం congress govt రూ.లక్షా 80 వేల కోట్లకు పైగా అప్పులు తీసుకొచ్చిందన్నారు. ఈ అప్పులతో ప్రభుత్వం కొత్తగా ఏ పనులు చేపట్టలేదని విమర్శించారు. ఈ డబ్బులతో ఏ పనులు చేశారోనని తాము అధ్యయనం చేశామన్నారు. రేవంత్​రెడ్డి ఒక ప్రాజెక్ట్​ కట్టలేదని, రైతు భరోసా rythu bharosa పూర్తి స్థాయిలో ఇవ్వలేదన్నారు. రుణమాఫీ loan waiver కూడా పూర్తిగా చేయలేదని పేర్కొన్నారు.

    అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను కాంగ్రెస్​ నెరవేర్చలేదని కవిత మండిపడ్డారు. పెన్షన్లు పెంచలేదని, తులం బంగారం హామీ అమలు చేయలేదన్నారు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్న హామీ అటే పోయిందని ఎద్దేవా చేశారు. కానీ అప్పులు తెచ్చి డబ్బులు మాత్రం నొక్కేశారన్నారు.

    MLC Kavitha | 20 శాతం కమీషన్​ వసూలు

    రేవంత్​రెడ్డి తాను తెచ్చిన రూ.లక్షా 80 వేల కోట్ల అప్పులో నుంచి రూ.80 వేల కోట్లు అప్పులు చెల్లించారని కవిత తెలిపారు. మిగతా రూ.లక్ష కోట్లను కాంగ్రెస్​ ప్రభుత్వం పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లించిందని ఆరోపించారు. గతంలో చేసిన పనుల కోసం 20 శాతం కమీషన్​ తీసుకొని ఈ బిల్లులు చెల్లించారన్నారు. రూ.20 వేల కోట్లు సీఎం రేవంత్​రెడ్డి సొంత ఖాజానాకు పోయాయాని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన ఆరోపణలు తప్పయితే ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్​ చేశారు.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...