అక్షరటుడే, వెబ్‌డెస్క్: Uttar Pradesh | ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బరేలీలో ఒక కామాంధుడు తన భర్తతో రాజీ పడాలంటూ అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతోపాటు ఆమెపై అభ్యంతరకరమైన వీడియో రికార్డు(Video Record) చేశాడు. దానిని వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. సుమారు 7 నెలల తర్వాత, బాధిత మహిళ నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు (police registered case).. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Uttar Pradesh | అసలేం జరిగిందంటే..
బరేలీ జిల్లాలోని నవాబ్‌గంజ్(Nawabganj) ప్రాంతంలో నివసించే ఒక మహిళకు తన భర్తతో వివాదం ఏర్పడింది. దీనిని ఆసరాగా చేసుకుని, భర్త స్నేహితుడు మోసపూరితంగా వ్యవహరించాడు. బాధిత మహిళతో స్నేహం చేశాడు. రాజీకి రావాలని కోరాడు. భార్యాభర్తల మధ్య సయోధ్య కుదుర్చుతామని నమ్మించాడు. గతేడాది నవంబరు 8న ఆ కీచకుడు తనను బరేలీ(Bareilly)లోని ఒక హోటల్‌కు తీసుకెళ్లాడని బాధిత మహిళ పేర్కొంది. అక్కడ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
బాధితురాలు తిరగబడటంతో నిందితులు ఆమెకు సంబంధించి అశ్లీల వీడియో తీసి, దానిని వైరల్ చేస్తామని బెదిరించారు. భయపడిపోయిన బాధితురాలు చాలా రోజులపాటు మౌనంగా ఉండిపోయింది. దాదాపు 7 నెలల తర్వాత, ధైర్యం కూడగట్టుకుని నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్(Nawabganj Police Station)లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.