ePaper
More
    HomeజాతీయంUttar Pradesh | యూపీలో దారుణం.. ఇద్దరు బాలికల కిడ్నాప్​.. ఒకరిని కారులో నుంచి తోసి.....

    Uttar Pradesh | యూపీలో దారుణం.. ఇద్దరు బాలికల కిడ్నాప్​.. ఒకరిని కారులో నుంచి తోసి.. మరొకరిని కారులోనే..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh | మానవాళి సిగ్గుపడేలా చేసే ఘటన ఉత్తర్​ప్రదేశ్‌(Uttar Pradesh)లో వెలుగు చూసింది. బులంద్‌షహర్‌లో మీరట్ జాతీయ రహదారిపై కదులుతున్న కారులో నుంచి ఓ బాలికను కిరాతకంగా తోసేయడంతో గుర్తుతెలియని వాహనం ఢీకొని ప్రాణాలు కోల్పోయింది. మరో బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

    ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి స్నేహితులిద్దరినీ నిందితులు కిడ్నాప్(Kidnap) చేశారు. ఆ తర్వాత బులంద్‌షహర్‌లోని మీరట్ జాతీయ రహదారిపై (meerut national highway in bulandshahr) కదులుతున్న కారులో ఒక అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మరో అమ్మాయి అడ్డుకోవడంతో ఆమెను తన్ని కారు నుంచి బయటకు తోసేశారు. అయితే, వెనుకనే మరో గుర్తుతెలియని వాహనం ఆమెపై వెళ్లడంతో ఆ అభాగ్యురాలు అక్కడిక్కడే మృతి చెందింది.

    Uttar Pradesh | అసలు విషయం ఇలా వెలుగులోకి..

    రోడ్డుపై పడి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించిన జాని పోలీసులు(Police) ప్రమాదంగా భావించి, మార్చురీకి తరలించారు. మరణించిన బాలికను గుర్తించడానికి పోలీసు అధికారులు (police officers) ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. కాగా, ఖుర్జా(Khurja)లో సామూహిక అత్యాచారానికి గురైన బాలిక చివరికి కారు నుంచి దూకి ప్రాణాలను కాపాడుకుంది. బాలిక పోలీసులకు ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగుచూసింది.

    మరణించిన బాలిక బీహార్(Bihar) నివాసిగా తెలిసింది. గౌతమ్ బుద్ధ నగర్ లోని సూరజ్ పూర్ ప్రాంతంలో (surajpur area) ఉండేది. అక్కడే ఒక హోటల్‌లో పనిచేసేది. అత్యాచారానికి గురైన బాధితులు ప్రతాప్‌గఢ్ జిల్లాకు చెందిన నివాసిగా పేర్కొంటున్నారు. మే 6వ తేదీన అమిత్ అనే యువకుడు ఉద్యోగం ఇప్పిస్తానన్నాడని బాధితురాలు పోలీసులకు వివరించింది. అలా అమిత్ చెప్పిన ప్రదేశానికి ఆ బాలిక తన స్నేహితురాలితో కలిసి వెళ్లింది.

    అక్కడ ఇద్దరినీ అమిత్ కారులో ఎక్కించాడు. అతడి స్నేహితుడు సందీప్ అందులోనే ఉన్నాడు. అర్ధరాత్రి (mid night) అమిత్ తన మరొక స్నేహితుడిని కారులో ఎక్కించుకున్నాడు. ఆ ముగ్గురు నిందితులు తనకు బలవంతంగా మద్యం తాగించారని, తనను కొట్టి, సామూహిక అత్యాచారం బాధితురాలు తెలిపింది. తన స్నేహితురాలు (friends) అడ్డుకోవడంతో, నిందితులు ఆమెను తన్ని కారు నుంచి బయటకు విసిరేశారని వాపోయింది.

    బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు (police arrested three suspects). వారిపై ఖుర్జా పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్(Kidnap), హత్య(Murder,), సామూహిక అత్యాచారం (Gang Rape) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరణించిన బాలిక మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె ముఖం, నుదురు, చేతులు, కాళ్లపై 12 గాయాలున్నాయని వైద్యులు వెల్లడించారు.

    More like this

    Congress | కొత్త ఉప రాష్ట్ర‌ప‌తికి కాంగ్రెస్ అభినంద‌న‌.. నిష్పాక్షికంగా వ్య‌వ‌హరించాల‌ని విజ్ఞ‌ప్తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజ‌యం సాధించిన ఎన్డీయే అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణన్‌కు కాంగ్రెస్...

    Dichpally | బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally | పాఠశాల సమయాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు...

    Nepal Army | రంగంలోకి దిగిన నేపాల్ సైన్యం.. ఆందోళ‌న‌లు విర‌మించాల‌ని పిలుపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Army | ర‌ణ‌రంగంగా మారిన నేపాల్‌లో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం రంగంలోకి...