ePaper
More
    Homeబిజినెస్​Today gold price | స్థిరంగా బంగారం ధర.. అదే బాట‌లో వెండి.. ఈ రోజు...

    Today gold price | స్థిరంగా బంగారం ధర.. అదే బాట‌లో వెండి.. ఈ రోజు రేటు ఎంతంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Today gold price | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump).. బ్రిటన్‌తో వాణిజ్య ఒప్పందంపై కీలక ప్రకటన చేసిన విష‌యం తెలిసిందే. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి ఉన్న డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతోపాటు, వచ్చే వారం అమెరికా-చైనా ప్రతినిధుల మధ్య జరగనున్న వాణిజ్య చర్చలు కూడా సానుకూల సంకేతాలు ఇవ్వడంతో, బంగారం ధరలు మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉంది. పెళ్లిళ్లు అయినా.. పేరంటాలు అయినా.. ఏ శుభకార్యం అయినా సరే.. బంగారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర లక్ష రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం కూడా 90 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. బంగారం కొనాలనుకునే పేద, మధ్య తరగతి వాళ్లకు చుక్కలు చూపిస్తోంది.

    Today gold price | ఈ రోజు ధరలు ఎంతంటే..

    ఈ రోజు (12 మే , 2025) విలువైన బంగారం, వెండి ధరలు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయ‌నేది చూస్తే.. హైదరాబాద్​లో బంగారం ధర స్వల్పంగా దిగి వచ్చింది. దీంతో ఈ రోజు ప్యూర్ గోల్డ్ (24 క్యారెట్ల) 10 గ్రాముల బంగారం ధర రూ. 98,670లు ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,440గా కొనసాగుతోంది. ఇవే ధరలు తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ vijaywada, విశాఖపట్నం, రాజమండ్రి, పొద్దుటూరు, వరంగల్​లలో కొనసాగుతున్నాయి.

    రాజధాని ఢిల్లీలో(Delhi) 10 గ్రాముల బంగారం ప్యూర్ గోల్డ్ ధర 24 క్యారెట్ల ధర రూ. 98,820లగా కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,590లుగా ఉంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ.90,440 వద్ద ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 98,670 వద్ద కొనసాగుతోంది. ఇవే ధరలు దేశంలో ప్రధాన నగరాలైన చెన్నై, కోల్ కతా, కేరళ, బెంగళూరు, పూణే వంటి ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 98,680 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90450 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 74010 దగ్గర ట్రేడ్ అయింది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండికి వంద రూపాయలు మేర దిగి వచ్చి ఈ రోజు 1,10,900లు గా కొనసాగుతోంది. అయితే దేశంలో ప్రధాన నగరాలైన ధిల్లీ, ముంబై, బెంగుళూరు, కోల్​కతా వంటి నగరాల్లో కిలో వెండి ధర ఈ రోజు రూ. 98,900లు గా కొనగుతోంది.

    More like this

    CMRF Checks | బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Checks | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి(Ramchandrapalli Village) చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న...

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...

    Super Six | “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి .. ఎవ‌రెవ‌రు హాజ‌రు కానున్నారంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Super Six | కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం తొలిసారిగా అధికార పక్షం ఆధ్వర్యంలో...