ePaper
More
    HomeజాతీయంChhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం

    Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. రాయ్‌పుర్‌ జిల్లా Raipur district రాయ్‌పుర్ – బలోద బజార్ రోడ్డు Raipur – Baloda Bazaar road లోని సరగావ్‌ సమీపం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

    ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనాన్ని ట్రక్కు ఢీ కొనడం వల్ల ఈ యాక్సిడెంట్​ జరిగింది. మృతుల్లో తొమ్మిది మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. చటౌడ్ గ్రామానికి చెందిన ఒక కుటుంబం బన్సారీ గ్రామంలో జరిగిన కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం బారిన పడ్డారు.

    సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను రాయ్​పుర్​లోని డాక్టర్ బీఆర్​ అంబేడ్కర్ మెమోరియల్ ఆస్పత్రి (Dr. BR Ambedkar Memorial Hospital)కి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లా అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారని రాయ్​పుర్​ జిల్లా కలెక్టర్ గౌరవ్ సింగ్ పేర్కొన్నారు. ధార్సివా ఎమ్మెల్యే అనుజ్ శర్మ ఈ ప్రమాదంపై స్పందించి మాట్లాడారు. తాను అధికారులతో మాట్లాడినట్లు వెల్లడించారు.

    More like this

    Donald Trump | ట్రంప్ వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు.. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాన‌ని వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | భార‌త్ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

    Cross Voting | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపైనే అనుమానం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cross Voting | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధకృష్ణన్ ఘన...

    Weather Updates | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని...