అక్షరటుడే, బాన్సువాడ : Varni | రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో మాటమాట పెరిగి భారీ ఘర్షణకు దారి తీసింది. దాదాపు 200 మంది రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. వర్ని మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. అయితే ప్రమాదం అనంతరం ఆ బైక్‌లపై ఉన్నవారు గొడవ పడ్డారు. మాటమాట పెరగడంతో ఆ బైక్‌లపై ఉన్న వారు తమ గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. దీంతో అంతాపూర్, తగిలేపల్లి గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సుమారు 200 మంది రెండు వర్గాలుగా ఏర్పడి దాడులు చేసుకున్నారు. అయినా పోలీసులు స్పందించకపోవడం గమనార్హం.
