ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Agricultural University | వ్యవసాయ వర్సిటీలో కొత్త కోర్సులు.. అవేంటో చూద్దామా..

    Agricultural University | వ్యవసాయ వర్సిటీలో కొత్త కోర్సులు.. అవేంటో చూద్దామా..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Agricultural University | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ (Professor Jayashankar Telangana Agricultural University) – ఆస్ట్రేలియాలోని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ (Western Sydney University) సంయుక్తంగా నాలుగేళ్ల బీఎస్సీ వ్యవసాయ డిగ్రీ కోర్సు(B.Sc. Agriculture Degree) ప్రారంభించనున్నట్లు ఉపకులపతి అల్దాస్ జానయ్య తెలిపారు.

    నాలుగు సంవత్సరాల కోర్సు వ్యవధిలో విద్యార్థులు మూడేళ్లు పీజేటీఏయూలో, ఒక ఏడాది వెస్టర్న్ సిడ్నీ విశ్వవిద్యాలయంలో(Western Sydney University) విద్య అభ్యసిస్తారని పేర్కొన్నారు. ఈ కోర్సుతో రెండు విశ్వవిద్యాలయాల్లోనూ విద్యనభ్యసించే అవకాశం కలుగుతుందని వెల్లడించారు.

    విద్యార్థులు ఎమ్మెస్సీ చదవాలని భావిస్తే మరో ఏడాది వెస్టర్న్ సిడ్నీ విశ్వవిద్యాలయంలో(Western Sydney University) చదవాల్సి ఉంటుందని జానయ్య తెలిపారు. వెస్టర్న్ సిడ్నీ విశ్వవిద్యాలయంలో పీహెచ్​డీ చేయదలచుకుంటే ఎలాంటి రుసుము లేకుండా స్కాలర్ షిప్ సాయంతో కోర్సు పూర్తి చేయవచ్చన్నారు. ఈ అంశాలపై రెండు వర్సిటీల మధ్య ఒప్పందం కుదిరే ప్రక్రియ తుది దశలో ఉందని పీజీటీఏయూ ఉపకులపతి ప్రొఫెసర్ జానయ్య (PGTAU Vice-Chancellor Professor Janaiah) చెప్పారు.

    వెస్టర్న్ సిడ్నీ విశ్వవిద్యాలయం అందించే అన్ని వ్యవసాయ కోర్సులకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (Indian Council of Agricultural Research) గుర్తింపు ఉందన్నారు. ఈ ప్రత్యేక కోర్సుల ప్రవేశాల కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు జానయ్య వివరించారు.

    More like this

    Local Body Elections | స్థానిక ఎన్నికలపై కీలక అప్​డేట్​.. రిజర్వేషన్ల పెంపునకు గవర్నర్​ ఆమోదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్​డేట్​ వచ్చింది. బీసీ...

    Sriram Sagar | శ్రీరాంసాగర్ వరద గేట్ల మూసివేత

    అక్షరటుడే, బాల్కొండ: Sriram Sagar | తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి (Sriram Sagar Project) వరద తగ్గుముఖం...

    Yellareddy | చెరువు బాగు కోసం రైతులంతా ఏకమయ్యారు..

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామస్థులు తమ చెరువును...