ePaper
More
    Homeటెక్నాలజీKia carens clavis car | అధునాతన ఫీచర్లతో కియా కొత్త కారు

    Kia carens clavis car | అధునాతన ఫీచర్లతో కియా కొత్త కారు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Kia carens clavis car | దక్షిణ కొరియా(South korea)కు చెందిన ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ (automobile company Kia Motors) భారత మార్కెట్‌లో తన ఎంపీవీ(MPV) కారెన్స్ అప్‌డేట్‌ వర్షన్‌ను కియా కారెన్స్ క్లావిస్ పేరుతో విడుదల చేసింది. ప్రీమియం 7 సీటర్‌ ఎంపీవీ అయిన ఈ కారులో అధునాతన ఫీచర్లు, కొత్త హంగులు, మెరుగైన భద్రతా ఫీచర్లను జోడించింది. ఇటీవలే అడ్వాన్స్‌ బుకింగ్‌(Advance booking)ను ప్రారంభించిన కంపెనీ.. ధరను మాత్రం ఈనెల 23న ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. రూ. 11 లక్షలపైన ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మోడల్‌ విశేషాలు తెలుసుకుందామా..

    ఎక్స్‌టీరియర్‌(Exterior) డిజైన్: క్లావిస్‌లో కియా సిగ్నేచర్ డిజిటల్ టైగర్ ఫేస్ గ్రిల్‌తో ఆధునిక డిజైన్‌, ఐస్‌క్యూబ్‌ ఎంఎఫ్‌ఆర్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్టార్ మ్యాప్ ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి. రోడ్‌ ప్రజెన్స్‌ను మెరుగుపరిచేందుకు 17 Inches క్రిస్టల్‌ కట్‌ డ్యుయల్‌ టోన్‌ అల్లాయ్‌ వీల్స్‌ (Crystal Cut Dual Tone Alloy Wheels) అమర్చారు.

    Kia carens clavis car | ఎనిమిది రంగుల్లో..

    ఐవరీ సిల్వర్ గ్లోస్, ప్యూటర్ ఆలివ్, ఇంపీరియల్ బ్లూ, గ్లేసియర్ వైట్ పెర్ల్, గ్రావిటీ గ్రే, స్పార్కింగ్ సిల్వర్, అరోరా బ్లాక్ పెరల్‌, క్లియర్ వైట్ అనే ఎనిమిది కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

    ఇంటీరియర్‌(Interior) డిజైన్: క్లావిస్‌లో ముందు సీట్లు వాక్‌-ఇన్‌ స్లయిడింగ్‌ లివర్‌తో వస్తున్నాయి. సెకండ్‌ రో ప్యాసింజర్‌కూ ఫ్రంట్‌ సీట్‌ అడ్జస్ట్‌మెంట్‌ సౌలభ్యం ఉంటుంది. ఇందులో 26.62 అంగుళాల డ్యూయల్‌ పనోరమిక్‌ డిస్‌ప్లే ప్యానెల్‌ ఉంది. వెంటిలేటెడ్ ఫ్రంట్‌ సీట్లు, డ్యుయల్‌ జోన్‌ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

    Kia carens clavis car | మూడు రకాల ఇంజిన్లు..

    కియా కారెన్స్ క్లావిస్‌ మూడు రకాల ఇంజిన్‌ ఆప్షన్లతో (three types of engine options) వచ్చింది 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్‌ ఉన్నాయి.

    Kia carens clavis car | భద్రతాపరమైన ఫీచర్లు..

    కారెన్స్ క్లావిస్‌ 20కి పైగా భద్రతాపరమైన లెవెల్-2 అడాస్‌ ఫీచర్లతో వచ్చింది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు(Air bags), 360-డిగ్రీ కెమెరా, ఫార్వర్డ్‌ కొలిజన్‌ అవాయిడెన్స్‌ అసిస్ట్‌, లేన్‌ కీప్‌ అసిస్ట్‌, బ్లైండ్‌ వ్యూ మానిటర్‌, హైలైన్‌ టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, అడాప్టివ్‌ క్రూజ్‌ కంట్రోల్‌ వంటి అధునాతన ఫీచర్లున్నాయి.

    Kia carens clavis car | వేరియంట్స్‌..

    ఏడు వేరియంట్స్‌లో తీసుకువచ్చారు. HTE, HTE(O), HTK, HTK+, HTK+(O), HTX, HTX+.

    Kia carens clavis car | పోటీదారులు..

    మారుతి సుజుకీ ఎక్స్‌ఎల్‌6, హ్యుందాయ్‌ అల్కాజర్‌, టయోటా ఇన్నోవా, మహీంద్రా థార్‌, మారుతి గ్రాండ్‌ విటారాలకు పోటీదారుగా భావిస్తున్నారు.

    More like this

    Chhattisgarh | చత్తీస్గ‌ఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. కీలక నేత సహా పది మంది హతం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chhattisgarh | చత్తీస్గ‌ఢ్‌లో గురువారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు...

    Bodhan | విద్యుత్​స్తంభాలు తీసుకెళ్తుండగా ట్రాక్టర్​ బోల్తా.. ఇద్దరి మృతి

    అక్షరటుడే, బోధన్: Bodhan | విద్యుత్​ స్తంభాలు మీదపడి ఇద్దరు జీపీ సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటన...

    Rahul Gandhi | సెక్యూరిటీ ప్రొటోకాల్ ఉల్లంఘించిన రాహుల్.. కాంగ్రెస్ నేతపై మండిపడ్డ బీజేపీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన...