అక్షరటుడే, ఎల్లారెడ్డి: YellaReddy | లింగంపేట మండలం (lingampet mandal) బానాపూర్ తండాకు చెందిన ఉపాధ్యాయుడు ఈశ్వర్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలగం దామోదర్ రెడ్డి (State PRTU General Secretary Polagam Damodar Reddy) ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈశ్వర్ సంఘంలో కీలకమైన నాయకుడని, ఆయన మృతిపై సంఘం తరఫున సంతాపం తెలిపారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్, మండల అధ్యక్షుడు రవీందర్ శర్మ, పరువయ్య, సురేష్, స్వామి, బాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
