ram charan
Ram charan | టుస్సాడ్స్‌లో చ‌ర‌ణ్ మైన‌పు విగ్ర‌హం.. చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి.. అయినా హైప్ లేదేంటి?

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ram charan | చిరంజీవి త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చ‌ర‌ణ్‌ (Ram Charan). మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలుగా ఇండ‌స్ట్రీకి వచ్చిన వారిలో కొంద‌రు మాత్ర‌మే స్టార్ స్టేట‌స్ సంపాదించుకున్నారు. వారిలో రామ్ చ‌ర‌ణ్ ఒకరు. అంచెలంచెలుగా రామ్ చ‌ర‌ణ్ క్రేజ్ పెరుగుతూ పోతుంది. ఈ క్ర‌మంలోనే రామ్ చరణ్ అందించిన సేవలు, సాధించిన ఘనతలకు సూచికగా ఇప్పుడు అతనికి మరో అరుదైన గౌరవం దక్కింది.

Ram charan | ఇదీ కార‌ణం..

ప్రతిష్ఠాత్మక లండన్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో (Madame tussads museum) రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని భారత కాలమానం ప్రకారం శనివారం (మే10) సాయంత్రం స్వయంగా తానే ఆవిష్క‌రించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో (social media) తెగ వైరలవుతోంది (video viral on social media). ముఖ్యంగా ఈ వీడియోను చూసిన మెగాభిమానులు (mega fans) ఉప్పొంగిపోతున్నారు. భార్య (ఉపాసన)తో కలిసి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియానికి (Madame tussads museum) వెళ్లాడు రామ్ చరణ్. ఆ తర్వాత అశేష అభిమానుల సమక్షంలో తన మైనపు విగ్రహాన్ని (wax statue) ఆవిష్కరించాడు. ఈ మైనపు విగ్రహంలో చరణ్ తో పాటు అతడి పెట్ డాగ్ రైమ్ కూడా ఉండటం విశేషం. ఈ విగ్రహాన్ని త్వరలోనే సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలించనున్నారు.

అయితే ఇంత వ‌ర‌కు ఏ హీరో పెంపుడు కుక్క‌తో (pet dog) మైన‌పు విగ్ర‌హం చేసింది లేదు. తొలిసారి చ‌ర‌ణ్‌కి ఆ గౌర‌వం ద‌క్కింది. అయితే ముష్క‌ర దేశం పాకిస్తాన్ పై భార‌త్ యుద్ధం (india pakistan war) నేప‌థ్యంలో ప్ర‌జ‌లు, మీడియా దృష్టి పూర్తిగా అటువైపే ఉంది. యుద్ధం ఎంత‌దాకా వెళుతుందోన‌న్న భ‌యాందోళ‌న‌లు ప్ర‌జ‌ల్లో నెల‌కొన‌డంతో ఈ మ్యాట‌ర్ కి పెద్ద‌గా హైప్ లేదు. విగ్ర‌హావిష్క‌ర‌ణ కోసం మెగా కుటుంబం మొత్తం చాలా ముందుగానే లండ‌న్ కి చేరుకున్నారు. వారికి లండ‌న్‌లో ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. యుద్ధం భీక‌రంగా ఉన్న స‌మ‌యంలో ఇది జ‌రిగింది. అందువ‌ల్ల మీడియా నుంచి హైప్ అంత‌గా క‌నిపించ‌లేదు . వార్ వ‌ల్ల‌నే చ‌ర‌ణ్ కి ఈ హైప్ కొంత త‌గ్గిందని విశ్లేషిస్తున్నారు. ఎట్ట‌కేల‌కు లండ‌న్ టుస్సాడ్స్ లో చ‌ర‌ణ్‌ మైన‌పు విగ్ర‌హం (wax statue) రెడీగా ఉంది. దీంతో రియ‌ల్ రామ్ చ‌ర‌ణ్ ఫోటోలు దిగారు.