Akshara Today Desk: Shakti Dubey | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ Union Public Service Commission సివిల్ సర్వీసెస్ పరీక్ష Civil Services Exam 2024లో అగ్రస్థానంలో నిలిచింది శక్తి దూబే Shakti Dubey. ప్రస్తుతం ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఇంతకి ఆమె నేథప్యం ఏంటో తెలుసుకుందాం..
శక్తి దూబే Shakti Dubey.. ఈమెది యూపీలోని ప్రయాగ్‌రాజ్ prayagraj. మంగళవారం ప్రకటించిన UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచింది. అలహాబాద్ విశ్వవిద్యాలయం Allahabad University నుంచి శక్తి దూబే బయోకెమిస్ట్రీలో Biochemistry గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆప్షనల్ సబ్జెక్టుగా పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను ఎంచుకుంది.
Shakti Dubey | బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి..
దూబే ప్రయాగ్‌రాజ్‌లోనే Prayagraj city పాఠశాల, కళాశాల విద్యను అభ్యసించింది. అనంతరం బనారస్ banaras hindu university హిందూ విశ్వవిద్యాలయం (BHU) నుంచి బయోకెమిస్ట్రీలో పీజీ PG in Biochemistry పూర్తి చేసింది. తర్వాత 2018 నుంచి సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమవడం ప్రారంభించింది. చివరకు అనుకున్నది సాధించి దేశంలోనే టాప్ 1లో నిలించింది.
Shakti Dubey | సివిల్స్ చేరేందుకు కారణమిదే..
సివిల్ సర్వీసెస్‌లో civil services చేరాలనే తన నిర్ణయానికి కుటుంబ నేపథ్యమే కారణమని దూబే పేర్కొంది. “నా తండ్రి పోలీసు సర్వీసులో police service ఉన్నారు. మొదట్లో ఇది కేవలం ఉద్యోగమని అనుకునేదానిని.. కానీ ఆ తర్వాత కాలంలో పోలీసు ఉద్యోగం police job ఎంత ముఖ్యమైందో తెలుసుకున్నాను. ప్రజల రక్షణకు ఎంత అవసరమో గ్రహించాను. ప్రజా సేవకు public service ప్రభుత్వ వ్యవస్థలు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో తెలుసుకున్నారు. అందుకే ప్రజాసేవ పట్ల ఆకర్షితురాలినయ్యాను” అని పేర్కొంది. తన ప్రయాణంలో తల్లిదండ్రుల ఎంతో అండగా నిలిచారని తెలిపింది దూబే.