ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Jawan murali naik | వీర జవాన్​కు కన్నీటి వీడ్కోలు.. మురళీనాయక్‌ శవపేటిక మోసిన మంత్రి

    Jawan murali naik | వీర జవాన్​కు కన్నీటి వీడ్కోలు.. మురళీనాయక్‌ శవపేటిక మోసిన మంత్రి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Jawan murali naik | దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్‌ మురళీనాయక్‌కు (Jawan murali naik) కుటుంబీకులతో పాటు ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. అగ్నివీరుడిగా సైన్యంలో చేరి.. దేశ రక్షణలో భాగంగా అమరుడైన విషయం తెలిసిందే. పాక్ కాల్పుల్లో (pakistani firing) వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్‌ అంత్యక్రియలు ముగిశాయి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మురళీనాయక్​ అంతిమయాత్రలో (murali nayak funeral) ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జవాన్​ పార్థీవదేహం వద్ద తల్లిదండ్రులు కడసారి చేసిన సెల్యూట్ అందరినీ కంటతడి పెట్టించింది.

    Jawan murali naik | అంతిమయాత్రలో పాల్గొన్న డిప్యూటీ సీఎం, మంత్రులు

    మురళీనాయక్ స్వగ్రామం శ్రీసత్య సాయి జిల్లా (sathyasai district) కళ్లితండాలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (deputy Cm pawan kalyan), మంత్రులు లోకేష్‌ (minister lokesh), అనిత, సవిత, అనగాని సత్య ప్రసాద్ కళ్లి తండాకు వెళ్లారు. మురళీనాయక్‌ పార్థీవ దేహానికి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమయాత్రలో మురళీనాయక్‌ శవపేటికను మంత్రి లోకేష్ (minister nara lokesh) మోశారు. జాతీయ జెండా చేత పట్టుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు (deputy CM Pawan kalyan). మురళీనాయక్‌ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఐదెకరాల పొలం, 300 గజాల ఇంటిస్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. మురళీనాయక్‌ తండ్రికి ఉద్యోగం ఇస్తామని పవన్, లోకేష్ ప్రకటించారు.

    Latest articles

    Heavy rain in Hyderabad | హైదరాబాద్​లో దంచికొడుతున్న వాన.. ఆ ప్రాంతాల్లో కుంభవృష్టి

    అక్షరటుడే, హైదరాబాద్: Heavy rain in Hyderabad : బుధ, గురువారాల్లో భారీ వర్షాలు (Heavy Rain) ఉంటాయని...

    alcohol with volcanic ash | అగ్నిపర్వతాల బూడిదతో మద్యం తయారీ.. తాగారా దీనిని..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: alcohol with volcanic ash : అంతర్జాతీయ బ్రాండ్​ ఆల్కహాల్​ (international brand alcohol) కోసం...

    Good Sleep | పడుకునే ముందు వీటిని తినొద్దు.. అనారోగ్య సమస్యలకు దారి తీయొచ్చు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Good Sleep | మన ఆరోగ్యం, జీవనశైలిలో నిద్ర చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది....

    APP Notification | ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : APP Notification | రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్​ వెలువడింది. 118 అసిస్టెంట్​...

    More like this