ePaper
More
    Homeఅంతర్జాతీయంPakistan army | ఆ ఉగ్రదాడిలో మా పాత్ర.. ఒప్పుకున్న పాక్ అధికారి

    Pakistan army | ఆ ఉగ్రదాడిలో మా పాత్ర.. ఒప్పుకున్న పాక్ అధికారి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | పాకిస్తాన్​ ఆర్మీ అధికారి ఔరంగజేబ్​ అహ్మద్​ ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నాడు. తాము ఉగ్రవాదులకు మద్దతుగా ఉన్నామని బాహటంగానే చేప్పేశారు. పుల్వామా ఉగ్రదాడిలో pulwama terror attack పాక్ సైన్యం పాత్ర ఉందని ఒప్పుకున్నాడు. అంతేగాకుండా ఈ దాడిని పాక్ వ్యూహాత్మక ప్రతిభగా చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ మీడియా సమక్షంలో ఔరంగజేబ్​ పాకిస్తాన్​ ఉగ్రవాదులకు సాయం చేస్తోందని అంగీకరించాడు.

    పహల్​గామ్​​ ఉగ్రదాడి pahalgam terror attack తర్వాత భారత్​, పాకిస్తాన్​ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. భారత్​ ఆపరేషన్​ సిందూర్​ చేపట్టి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్​ సిందూర్​పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాక్ వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ పుల్వామా దాడిలో తమ పాత్ర ఉందని అంగీకరించాడు. ‘‘పుల్వామాలో మా అద్భుతమైన ప్రతిభను చూపించాం. మా ఎత్తుగడలు ఏంటో నిరూపించుకున్నాం. కార్యదక్షత.. వ్యూహాత్మక చతురతను ఇప్పటికే ప్రదర్శించాం’’ అని వ్యాఖ్యానించారు.

    Operation Sindoor | 40 మంది సైనికులు మృతి

    జమ్మూకశ్మీర్​లోని పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న ఆర్మీ జవాన్ల కాన్వాయ్​పై ఉగ్రవాదులు దాడి చేశారు. జైషే మహమ్మద్​ సంస్థకు చెందిన సూసైడ్​ బాంబర్​ దాడి చేయడంతో 40 మంది సైనికులు మృతి చెందారు. అప్పుడు ఈ ఘటనతో తమకు సంబంధం లేదని బుకాయించిన పాక్​.. తాజాగా తామే దాడి చేశామని చెప్పుకోవడం గమనార్హం.

    Operation Sindoor | వైమానిక దాడులతో ప్రతీకారం

    పుల్వామా ఉగ్రదాడికి భారత్​ వైమానిక దాడులతో బదులు చెప్పింది. 2019 ఫిబ్రవరి 25న భారత వైమానిక దళం పాకిస్తాన్​లోని బాలాకోట్​లో గల ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 300 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయారు. అయినా బుద్ధి మార్చుకోని పాకిస్తాన్​ తాజాగా మళ్లీ పహల్​గామ్​లో ఉగ్రదాడి చేయించింది.

    More like this

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...

    Ramareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy mandal | రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం (society office) వద్ద యూరియా...