Bodhan
Bodhan

అక్షరటుడే, బోధన్: Bodhan | పట్టణంలోని కోట మైసమ్మ సహిత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి జన్మదినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిపించారు. వేద పండితులు ప్రవీణ్​ మహరాజ్​, రోహిత్​ శర్మ ఆధ్వర్యంలో తంతు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లారం పిట్ల కృష్ణ మహరాజ్​ (mallaram pitla krishna maharaj) హాజరయ్యారు. అంతేకాకుండా ఉదయం నుంచి భక్తులు అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం (annadan program) చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు పసుపులేటి సంధ్య, లక్ష్మి, గోపి కిషన్, భక్తులు లోకేష్, రుక్మిణి, కోనేటి కృష్ణ, జనార్దన్​, భీమ్​రావు, కుమార్, రాజేశ్వర్, కిషోర్, అక్షయ్, లింగం, గౌతమ్, బిల్ల విజయ్ పాల్గొన్నారు.