ePaper
More
    HomeజాతీయంBrahmos | భారత శక్తి ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పాం: రక్షణమంత్రి రాజ్​నాథ్​

    Brahmos | భారత శక్తి ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పాం: రక్షణమంత్రి రాజ్​నాథ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Brahmos | భారత శక్తి ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పామని రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ తెలిపారు. ఆపరేషన్​ సిందూర్​ ద్వారా ఉగ్రవాదులకు గట్టి బుద్ధి చెప్పామని పేర్కొన్నారు. ఆపరేషన్​ సిందూర్​ ప్రజలను ఎక్కడా టార్గెట్​ చేయలేదని చెప్పారు. కేవలం పాక్​ సరిహద్దే కాదు.. రావల్పిండిపైనా దాడి చేశామని పేర్కొన్నారు. బ్రహ్మోస్​ క్షిపణి ద్వారా శత్రువుకు మన శక్తి ఏమిటో చూపించామని తెలిపారు. ఉత్తరప్రదేశ్​లోని లక్నోలో బ్రహ్మోస్​ క్షిపణి brahmos missile తయారీ యూనిట్​ను రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్ rajnath singh​ ఆదివారం ప్రారంభించారు. ఢిల్లీ నుంచి ఆయన వర్చువల్​గా యూనిట్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో లక్నో రాలేకపోయానని చెప్పారు. బ్రహ్మోస్​ ఇంటిగ్రేషన్​, టెస్టింగ్​ ఫెసిలిటీ సెంటర్​ ఏర్పాటుకు సహకరించిన యూపీ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. 40 నెలల్లోనే ఈ యూనిట్​ పూర్తి చేశారని కొనియాడారు. ఇదే రోజున మన శాస్త్రవేత్తలు అణుపరీక్షలు చేశారని మంత్రి గుర్తు చేశారు. యూపీ డిఫెన్స్​ కారిడార్​కు ఇది దోహదం చేస్తోందన్నారు. సూపర్​ సోనిక్​ క్రూయిజ్​ మిసైల్స్​ ఉత్పత్తితో భారత రక్షణ వ్యవస్థ defence system మరింత పటిష్టం అవుతుందన్నారు.

    Brahmos | బ్రహ్మోస్​ గురించి పాక్​ను అడగండి

    లక్నోలో రూ. 300 కోట్ల ఖర్చుతో బ్రహ్మోస్‌ ప్రొడక్షన్‌ యూనిట్‌ ఏర్పాటు చేశారు. దీని కోసం 80 హెక్టార్ల స్థలాన్ని ఉచితంగా కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ UP CM Yogi మాట్లాడుతూ.. బ్రహ్మోస్‌ క్షిపణి పనితీరు ఎలా ఉంటుందో పాకిస్తాన్‌ను అడగండి అన్నారు. ఉగ్రదాడి ఏదైనా యుద్ధంగానే పరిగణించాలన్నారు. కాగా బ్రహ్మోస్​ను ఇంతవరకు యుద్ధ క్షేత్రంలో వినియోగించలేదు. అయితే ఆపరేషన్​ సిందూర్​లో భాగంగా బ్రహ్మోస్​ మిసైల్​ వాడినట్లు యోగి చెప్పడం గమనార్హం. దాని ప్రభావం ఎలా ఉందో పాక్​ను​ అడగాలని ఆయన అన్నారు. దీనిని బట్టి భారత్​ బ్రహ్మోస్​తో పాక్​పై దాడులు చేసినట్లు తెలుస్తోంది. అత్యంతవేగంగా వెళ్లే బ్రహ్మోస్​ క్షిపణిని యుద్ధ క్షేత్రంలో భారత్ విజయవంతంగా వినియోగించినట్లు తెలుస్తోంది.

    Brahmos | బ్రహ్మోస్​ ప్రత్యేకతలు..

    బ్రహ్మోస్​ అత్యంత వేగంగా వెళ్లగలిగే సూపర్​సోనిక్​ మిసైల్​. దీనిని భారత్​, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. నేలపై నుంచి, సముద్రంపై నుంచి, సముద్రం లోపల నుండి (జలాంతర్గాముల నుంచి), ఆకాశం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించవచ్చు. ఇది 200 నుంచి 300 కిలోల వార్​హెడ్​ను మోసుకెళ్లగలదు. అత్యంతవేగంతో వెళ్లడంతో పాటు శత్రురాడార్ల కళ్లు గప్పి లక్ష్యాలను ఛేదించడం దీని ప్రత్యేకత.

    Latest articles

    constable ready for fifth marriage | కామాంధ కానిస్టేబుల్​.. ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు.. అధికారులు ఏం చేశారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: constable ready for fifth marriage : మంచి సర్కారు ఉద్యోగం.. అందమైన భార్య.. చింతలు...

    Kagadala rally | యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘ఓట్ చోర్.. గద్దె చోడ్’ కాగడాల ర్యాలీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Kagadala rally : ఓట్ చోర్ .. గద్దె చోడ్ అనే నినాదంతో...

    goat with human face | మనిషి ముఖంతో మేక పిల్ల జననం..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: goat with human face : మనిషి ముఖంతో మేక పిల్ల జన్మించింది.. బ్రహ్మంగారి(Brahmangari) కాలజ్ఞానం...

    ORR | ఓఆర్​ఆర్​ సర్వీస్ ​రోడ్డుపైకి దూసుకొచ్చిన పెద్ద బండరాళ్లు.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ORR | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో నాలుగైదు రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ...

    More like this

    constable ready for fifth marriage | కామాంధ కానిస్టేబుల్​.. ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు.. అధికారులు ఏం చేశారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: constable ready for fifth marriage : మంచి సర్కారు ఉద్యోగం.. అందమైన భార్య.. చింతలు...

    Kagadala rally | యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘ఓట్ చోర్.. గద్దె చోడ్’ కాగడాల ర్యాలీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Kagadala rally : ఓట్ చోర్ .. గద్దె చోడ్ అనే నినాదంతో...

    goat with human face | మనిషి ముఖంతో మేక పిల్ల జననం..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: goat with human face : మనిషి ముఖంతో మేక పిల్ల జన్మించింది.. బ్రహ్మంగారి(Brahmangari) కాలజ్ఞానం...