ePaper
More
    HomeజాతీయంOperation Sindoor | ఆపరేషన్​ సిందూర్​ కొనసాగుతోంది.. ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ కీలక ప్రకటన

    Operation Sindoor | ఆపరేషన్​ సిందూర్​ కొనసాగుతోంది.. ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ కీలక ప్రకటన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | ఇండియన్​ ఎయిర్​ఫోర్స్ indian air force​ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్​ సిందూర్ operation sindoor​ ఇంకా కొనసాగుతోందని ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్​ వేదికగా ఆదివారం ఉదయం పోస్ట్​ చేసింది. కాగా ఆపరేషన్​ సిందూర్ అనంతరం భారత్​ – పాకిస్తాన్​ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. పాక్​ భారత్​లోని పలు ప్రాంతాలపై దాడులు చేయగా భారత్​ తిప్పి కొట్టింది. అనంతరం భారత్​ ప్రతిదాడులు చేసింది. పాకిస్తాన్​లోని ఎయిర్​ బేస్​లు, మిలటరీ స్థావరాలే లక్ష్యంగా భారత వైమానిక దళం దాడులు చేసింది.

    Operation Sindoor | కాల్పుల విరమణ

    ఉద్రిక్తతలు తగ్గించడానికి ఇరు దేశాల ఆర్మీ జనరల్స్ army generals​ చర్చించి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు. శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ ceasefire అమలులోకి వచ్చింది. అయితే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్​ శనివారం రాత్రి సరిహద్దులోని పలు ప్రాంతాలపై దాడులు చేసింది. ఈ క్రమంలో ఆపరేషన్​ సిందూర్​ ఇంకా కొనసాగుతోందని ఇండియన్​ ఎయిర్​ ఫోర్స్​ ప్రకటించడం గమనార్హం. తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేశామని, అత్యంత కచ్చితత్వం దాడులు చేశామని ఐఏఎఫ్​ పేర్కొంది. ఆపరేషన్‌ సిందూర్​పై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఐఏఎఫ్​ ట్వీట్​ చేసింది.

    Operation Sindoor | కాసేపట్లో ప్రకటన

    ప్రధాని మోదీ (pm modi) తన నివాసంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఆపరేషన్​ సిందూర్​, కాల్పుల విరమణ అంశంపై ఆయన రక్షణ శాఖ అధికారులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో ఐఏఎఫ్​ IAF ప్రకటన చేయడం గమనార్మం. ఉగ్రవాదంపై పోరు కొనసాగుతుందని చెప్పేలా ఇలా ట్వీట్​ చేసిందా.. లేదా పాక్​ దాడులకు ప్రతిదాడులు తప్పవనే ఉద్దేశంలో చేసిందా అని తెలియాల్సి ఉంది. దీని మరికొద్ది సేపట్లో రక్షణశాఖ, విదేశాంగ అధికారులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

    Operation Sindoor | అప్రమత్తంగా సైన్యం

    కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన భారత సైన్యం సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉంది. భారీ ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థతో పహారా కాస్తోంది. పాక్​ శనివారం రాత్రి దాడులు చేయడంతో మళ్లీ ఆ దేశం ఒప్పందాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందని భావించిన కేంద్రం సైన్యానికి ఫుల్​ పవర్స్​ ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాక్​ మళ్లీ దాడులకు పాల్పడితే తగిన బుద్ధి చెప్పడానికి సైన్యం సన్నద్ధంగా ఉంది.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...