అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Panchayat Elections | తొలిదశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. గురువారం రాత్రి వరకు పలు గ్రామాల్లో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి విజేతలను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో 95 ఏళ్ల వృద్ధుడు సర్పంచ్‌గా గెలిచాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా (Suryapet District)లో చోటు చేసుకుంది.
ప్రస్తుత జీవన విధానంలో 60 ఏళ్లకే చాలా మంది అనారోగ్యానికి గురి అవుతున్నారు. కనీసం నడవలేక పోతున్నారు. అది 95 ఏళ్లు అంటే మాట్లాడటం కూడా కష్టమే. కానీ ఆయన మాత్రం సర్పంచ్‌గా బరిలో నిలిచి గెలుపొందారు. గ్రామంలో ప్రచారం చేసి విజయం సాధించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం (Tungaturthi Constituency)లోని నాగారం గ్రామానికి చెందిన గుంటకండ్ల రామచంద్రారెడ్డి సర్పంచ్‌గా గెలుపొందారు.
Panchayat Elections | ఎమ్మెల్యే తండ్రి
రామచంద్రారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో సైతం చురుగ్గా పాల్గొన్నారు. సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఈయన కుమారుడే. తన స్వగ్రామంలో ఆయన సర్పంచ్‌గా బరిలో నిలిచారు. 95 ఏళ్ల వయసులోనూ గ్రామంలో జోరుగా ప్రచారం చేశారు. తాను వారి కోసం పని చేయగలనని ఓటర్లను ఒప్పించారు. దీంతో ఆయన విజయం సాధించారు.
Panchayat Elections | బీఆర్ఎస్కు ఊపు
పంచాయతీ తొలి దశ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీగానే గెలుపొందారు. మొత్తం సర్పంచ్ స్థానాల్లో 44 శాతం ఆ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ 1,703 స్థానాల్లో గెలుపొందగా.. బీఆర్ఎస్ 1,345 సీట్లలో గెలిచింది. బీజేపీ దాదాపు 200 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న భారీగా సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడంతో బీఆర్ఎస్ (BRS) శ్రేణుల్లో ఊపు వచ్చింది. దీంతో రెండు, మూడు దశ ఎన్నికల్లో మరింత ఉత్సాహంగా పని చేసే అవకాశం ఉంది.