Homeజిల్లాలునిజామాబాద్​Prajavani | ప్రజావాణికి 94 ఫిర్యాదులు

Prajavani | ప్రజావాణికి 94 ఫిర్యాదులు

ప్రజావాణిలో ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Prajavani | ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి (Collector T. Vinay Krishna Reddy) అధికారులకు సూచించారు. నగరంలోని కలెక్టరేట్​లో (Collectorate) సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 94 ఫిర్యాదులు అందాయి.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులు తమ సమస్యలను కలెక్టర్​తో పాటు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar), జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్, నగర పాలక సంస్థ సహాయ కమిషనర్ రవీంద్ర సాగర్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డిలకు అర్జీలు సమర్పించారు. కాగా.. ఫిర్యాదులను పెండింగ్​లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

Must Read
Related News