- Advertisement -
HomeUncategorizedMaharashtra | ఇది క‌దా అస‌లైన బాండింగ్ అంటే.. 93 ఏళ్ల వయసులో భార్యకు మంగళసూత్రం.....

Maharashtra | ఇది క‌దా అస‌లైన బాండింగ్ అంటే.. 93 ఏళ్ల వయసులో భార్యకు మంగళసూత్రం.. ఫిదా అయిన షాపు య‌జ‌మాని

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Maharashtra | ఈ రోజుల్లో భ‌ర్త‌ను భార్య‌లు చంపుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. కానీ కొన్ని జంట‌ల మ‌ధ్య ప్రేమానురాగాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. తాజాగా జ‌రిగిన సంఘ‌ట‌న చూస్తే కంట క‌న్నీరు రాక మాన‌దు. తెల్ల ధోతి, కుర్తా, టోపీ ధరించి ఉన్న ఓ వృద్ధుడు(93) ఓ వన్​ గ్రామ్​ గోల్డ్​ దుకాణం(Gold shop)లోకి తన భార్యతో వచ్చాడు. వారిని చూసిన షాపు సిబ్బందికి వారు అక్కడకు ఎందుకు వచ్చారో అర్థం కాలేదు. ఏదైనా సాయం అడగడానికి ఆ వృద్ధ దంపతులు వచ్చారని భావించారు. అయితే ఆ స‌మ‌యంలో ఆ వృద్ధుడు తన భార్యకు మంగళసూత్రం కొనడానికి వచ్చానని షాపు సిబ్బందికి చెప్పాడు.

Maharashtra | గుండెల్ని పిండేస్తున్న వీడియో

ఆ వృద్ధుడు ఈ వయసులో తన భార్యపై చూపిస్తున్న ప్రేమకు ఆ షాపు యజమాని క‌రిగిపోయి చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు. భావోద్వేగానికి గురయ్యాడు. ఆ వృద్ధుడికి మంగళసూత్రానికి కేవలం 20 రూపాయలకే ఇచ్చాడు. మహారాష్ట్రలోని జాల్నా జిల్లా అంబోరా జహంగీర్ గ్రామం(Ambora Jahangir village)లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న ఎంతో మందిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. నివృత్తి షిండే(93), ఆయన భార్య శాంతాబాయి వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. ప్రస్తుతం ఆషాఢ ఏకాదశి సందర్భంగా పండరీపురానికి కాలినడకన యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో వారు ఇటీవల ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఓ నగల దుకాణానికి వెళ్లారు. వారి వేషధారణ చూసి ఏదైనా ఆర్థిక సహాయం కోసం వచ్చారేమోనని భావించారు.

- Advertisement -

షాపులోకి ప్రవేశించి.. తన భార్యకు మంగళసూత్రం (Mangal Sutra) కొనాలని అక్కడి వారితో చెప్పాడు. తన దగ్గర రూ.1,120 ఉందని చెప్పాడు. ప్రస్తుతం ఆషాఢ మాసం ఏకాదశి వస్తుంది. కాబట్టి తాము పండరి పురం యాత్ర చేస్తున్నాం. తన భార్యకు.. మంగళసూత్రం కొనివ్వాలని అతను షాపులోకి వెళ్లి అక్కడి సిబ్బందితో మాట్లాడాడు. దీంతో వారి మధ్య ఉన్న బాండింగ్​కు ఫిదా అయిపోయిన షాపు యజమాని కేవలం రూ. 20 తీసుకుని వారికి బంగారం మంగళ సూత్రం కానుకగా ఇచ్చాడు. షాపు ఓనర్ మీలాంటి పెద్ద వాళ్ల ఆశీర్వాదాలు తమమీద ఉండాలని చెబుతూ వాళ్ల చేతికి మంగళసూత్రం కానుకగా ఇచ్చాడు. ఈ క్రమంలో దంపతులు ఇద్దరు భావొద్వేగానికి గురయ్యారు. ఇది చూసిన నెటిజ‌న్స్.. భార్యాభర్తల అనుబంధం ఎలాంటిదో నేటి యువ‌త ఈ వీడియో చూసైనా కాస్త బుద్ది తెచ్చుకుంటే బాగుంటుంద‌ని అంటున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News