అక్షరటుడే, ఇందూరు : Prajavani Nizamabad | ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. కాగా.. ప్రజావాణికి మొత్తం 93 ఫిర్యాదులు అందాయి.
Prajavani Nizamabad | అర్జీలను స్వీకరించిన అధికారులు..
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్ (Additional Collectors Ankit), కిరణ్ కుమార్, జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్, హౌసింగ్ పీ.డీ పవన్ కుమార్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్‌లకు విన్నవించారు. ఈ సందర్భంగా వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.