Stock Market
Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | ఆశ ప్రపంచాన్ని నడిపిస్తుంది. అత్యాశ అధ:పాతాళానికి తీసుకుపోతుంది. స్టాక్‌ మార్కెట్‌(Stock market)లో లాభాలను ఆర్జించవచ్చు. మార్కెట్‌ను అధ్యయనం చేసి, కంపెనీల పనితీరు చూసి పెట్టుబడులు పెడితే మంచి రాబడి పొందడానికి అవకాశాలుంటాయి. అయితే అత్యాశతో చాలామంది ఎలాంటి పరిశీలన చేయకుండానే ఈక్విటీ డెరివేటివ్స్‌(Equity Derivatives) సెగ్మెంట్‌లో భారీగా లాభాలు వస్తాయన్న ఉద్దేశంతో పెట్టుబడి పెట్టి నిండా మునుగుతున్నారు. సెబీ(SEBI) నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఆప్షన్‌ ట్రేడింగ్‌ అన్నది అధిక రిస్క్‌(Risk)తో కూడుకున్నది. ఇందులో తొంభై శాతం నష్టపోతున్నారని తెలిసినా.. మిగిలిన పది మందిలో తానుంటానన్న అతి నమ్మకంతో చాలామంది ట్రేడింగ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. చివరికి భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నారు. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) ఇటీవల వెలువరించిన నివేదిక(Report) ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ డెరివేటివ్స్‌ సెగ్మెంట్‌లో ఇండివిడ్యువల్‌ ట్రేడర్స్‌(Individual Traders)లో 91 శాతం నష్టపోయారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలోనూ 90 శాతానికిపైగా వ్యక్తిగత ట్రేడర్లు నష్టాలను చవిచూశారు.

2023-24 ఆర్థిక సంవత్సరం(Financial year)లో రూ. 74,812 కోట్లు నష్టపోయారు. ఒక్కో ట్రేడర్‌ సగటున రూ. 86,728 పోగొట్టుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ట్రేడర్ల మొత్తం నష్టాలు 41 శాతం పెరిగి రూ. 1.06 లక్షల కోట్లకు చేరాయి. ఇదే సమయంలో ఒక్కో ట్రేడర్‌(Trader) సగటు నష్టాలు 25 శాతం పెరిగి రూ.1.10 లక్షలకు పెరిగాయి. అయితే సెబీ తీసుకుంటున్న చర్యలతో ఆప్షన్‌ ట్రేడింగ్‌(Option trading)లో పాల్గొనేవారి సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది.

Stock Market | సెబీ చర్యలతో తగ్గిన ట్రేడర్లు..

ఆప్షన్స్‌లో వ్యక్తిగత ట్రేడర్లు భారీగా నష్టపోతుండడంతో సెబీ కొన్ని కఠినమైన నిబంధనలు తీసుకువచ్చింది. ఈక్విటీ ఇండెక్స్‌ డెరివేటివ్స్‌ ఫ్రేమ్‌వర్క్‌(Frame work)ను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంది. ఇందులో రిస్క్‌ మానిటరింగ్‌, డిస్​క్లోజర్‌ను మెరుగుపరచడం, సింగిల్‌ స్టాక్స్‌పై డెరివేటివ్స్‌ బ్యాన్‌ పీరియడ్స్‌ను తగ్గించడం, ఇండెక్స్‌ ఆప్షన్స్‌లో మానిపులేషన్‌ రిస్క్‌పై నిఘా పెంచడం వంటివి ఉన్నాయి. ఇవి గతేడాది అక్టోబర్‌ 1 నుంచి అమలులోకి వచ్చాయి. దీంతో ఆప్షన్స్‌లో పాల్గొనేవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 96 లక్షల మంది యునిక్‌ ట్రేడర్లు ఈ సెగ్మెంట్‌లో పాల్గొన్నారు. ఇది అంతకుముందు సంవత్సరం కంటే 20 శాతం తక్కువ. ఆప్షన్స్‌లో అధిక రిస్క్‌(High risk) ఉన్నందున అత్యంత జాగ్రత్తగా ఉండాలని సెబీ సూచిస్తోంది.