అక్షరటుడే, కామారెడ్డి : District Court Judgement | అజాగ్రత్తగా ఆటో నడిపి ఒకరి మృతికి కారణమైన నిందితుడికి కామారెడ్డి న్యాయస్థానం 9 నెలల జైలు విధించింది. దీంతోపాటు రూ.1,500 జరిమానా కూడా కట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా న్యాయమూర్తి వరప్రసాద్ తీర్పునిచ్చారు.
భిక్కనూరు పట్టణంలో అద్దె ఇంట్లో ఉంటున్న జమ్మగౌని పోట్ల ముత్తాగౌడ్ తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఆటో డ్రైవర్ బోయిని స్వామి అతి వేగంగా అజాగ్రత్తగా నడుపుతూ ఢీకొట్టాడు. దీంతో ముత్తాగౌడ్ తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రుడిని జిల్లా ఆసుపత్రికి, అక్కడి నుంచి గాంధీ హాస్పటిల్(Gandhi Hospital)కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముత్తాగౌడ్ మరణించారు.
District Court Judgement | జిల్లా కోర్టుకు అప్పీల్..
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. గత ఏప్రిల్ 4 న అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు మెజిస్ట్రేట్ Additional Judicial First Class Court Magistrate (స్పెషల్ మొబైల్ కోడ్ జడ్జ్ కామారెడ్డి) నిందితుడికి 9 నెలల జైలు శిక్షతో పాటు రూ.1500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
ఈ తీర్పుపై నిందితుడు జిల్లా కోర్టులో అప్పీల్‌కు వెళ్లాడు. బుధవారం జిల్లా న్యాయమూర్తి (District Judge) వర ప్రసాద్ విచారణ అనంతరం నిందితుడికి అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పు సరైనదేనని తీర్పునిచ్చారు.