అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy Nominations | పురపోరులో భాగంగా ముఖ్యమైన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ మేరకు శుక్రవారం అభ్యర్థులు ఉత్సాహంగా తమ నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు.
Yellareddy Nominations | ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో..
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ (Yellareddy Municipality) పరిధిలోని 12 వార్డులకు సంబంధించి 88 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ (Election Commission) ఇచ్చిన గడవు మేరకు మూడు రోజులపాటు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను మున్సిపల్ రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. మొదటిరెండు రోజుల కంటే మూడోరోజు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు నమోదయ్యాయి.
Yellareddy Nominations | మూడవ రోజు 62 నామినేషన్లు..
ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి మొదటిరోజు రెండు రామినేషన్లు, రెండో రోజు 24, నామినేషన్లు మూడోరోజు 62 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అందులో బీఎస్పీ పార్టీ నుండి మూడు, బీజేపీ (BJP) నుండి 17, కాంగ్రెస్ నుండి 31, బీఆర్ఎస్ నుండి 28, స్వతంత్ర అభ్యర్థులు 9 మంది తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు దాఖలు చేశారు.
Yellareddy Nominations | బీ–ఫాంల కోసం ఎదురుచూపులు..
నామినేషన్ పత్రాలు దాఖలైన అనంతరం అభ్యర్థులు ప్రస్తుతం బీఫాంల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధాన పార్టీల ప్రకటన కోసం వేయికళ్లలో వేచి ఉన్నారు. ఒక్కో వార్డులో ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలువడంతో ఎవరికి బీఫాం దక్కుతుందనే సందిగ్ధత నెలకొంది. బీ ఫాంల కోసం నాయకులు ఇప్పటికే సీనియర్ నాయకులతో మంతనాలు చేస్తున్నారు. కాగా ప్రధాన పార్టీల నాయకులు బీఫాం (B Form)లను ఉపసంహరణ రోజే నేరుగా అందించనున్నట్లు సమాచారం.
Yellareddy Nominations | వార్డుల్లో నామినేషన్ల వివరాలు
1వ వార్డులో 12, 2వ వార్డులో 4, 3వ వార్డులో 4, 4వ వార్డులో 2, 5వ వార్డులో 2, 6వ వార్డులో 9, 7వ వార్డులో 4, 8వ వార్డులో 9, 9వ వార్డులో 5, 10వ వార్డులో 2, 11వ వార్డులో 6, 12వ వార్డులో 3 నామినేషన్లు దాఖలు అయ్యాయి.