అక్షరటుడే, ఇందూరు: Prajavani | ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit) అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్లో (Collectorate Nizamabad) సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 88 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్‌తో పాటు డీఆర్డీవో సాయాగౌడ్ (DRDO Sayagoud), ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్‌లకు (Bodhan ACP Srinivas) విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా.. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.