ePaper
More
    HomeజాతీయంAir India | ఐదు రోజుల్లో 83 విమానాల రద్దు.. ఎయిర్​ ఇండియా ప్రయాణికులకు ఇక్కట్లు

    Air India | ఐదు రోజుల్లో 83 విమానాల రద్దు.. ఎయిర్​ ఇండియా ప్రయాణికులకు ఇక్కట్లు

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Air India : ఎయిర్​ ఇండియా ప్రయాణికులకు ఇటీవల ఇక్కట్లు కొనసాగుతున్నాయి. అహ్మదాబాద్​ ఫ్లైట్​ క్రాష్​ తర్వాత జూన్ 12 జూన్ 17, 2025 మధ్య (సాయంత్రం 6:00 గంటల వరకు), ఎయిర్ ఇండియా 83 వైడ్-బాడీ విమానాలను రద్దు చేయడం గమనార్హం.

    ఎయిర్​ ఇండియా రద్దు చేసిన ఫ్లైట్​లలో 66 బోయింగ్ 787 విమానాలు ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation – DGCA) వెల్లడించింది. జూన్ 12న AI 171 విమాన ఘోర ప్రమాదం తర్వాత ఎయిర్‌లైన్ బోయింగ్ 787 విమానాలపై భద్రతా తనిఖీలను పెంచింది. ఈ క్రమంలోనే ఈ రద్దులు జరిగాయి.

    బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం AI 171(Boeing 787-8 Dreamliner flight AI 171), అహ్మదాబాద్(Ahmedabad) నుంచి టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలిపోయి పేలిపోయింది. ఈ ప్రమాదంలో సిబ్బంది సహా 241 మంది ప్రయాణికులు మరణించారు. అటు వైద్య విద్యార్థులు, ప్రజలు చనిపోయారు.

    ఈ ఘటన తర్వాత ఎయిర్ ఇండియాకు చెందిన 33 బోయింగ్ 787 విమానాల(Boeing 787 aircraft)పై విస్తృతమైన నిర్వహణ తనిఖీలు చేపట్టాలని DGCA ఆదేశించింది. ఈ తనిఖీలలో టేకాఫ్ పారామితులు, ఎలక్ట్రానిక్ ఇంజిన్ నియంత్రణ వ్యవస్థలు, ఇంధన సంబంధిత భాగాల అంచనాలు ఉన్నాయి.

    ఎయిర్ ఇండియా విమానాల రద్దు అంతర్జాతీయ పర్యాటకుల(international tourists)పై ప్రభావం చూపాయి. ముఖ్యంగా వియన్నా(Vienna), దుబాయ్(Dubai), లండన్(London) తదితర దేశాలకు వెళ్లే వారిపై తీవ్ర ప్రభావం చూపింది. సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని విమానాలను ప్రత్యామ్నాయ ప్రదేశాలలో నిలిపివేయడంతో ఆయా విమానాశ్రయాలలో అంతరాయాలు ఏర్పడ్డాయి. రద్దు కారణంగా ప్రభావితమైన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా పూర్తి మొత్తాన్ని వాపసు ఇచ్చింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...