అక్షరటుడే, కామారెడ్డి : Panchayat Elections | జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలలో ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏకంగా 80.62 శాతం నమోదైంది.
Panchayat Elections | బాన్సువాడ డివిజన్లో..
జిల్లాలోని బాన్సువాడ (Banswada) డివిజన్ పరిధిలో మొత్తం 1,90,296 మంది ఓటర్లు ఉండగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు 1,53,417 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాన్సువాడ మండలంలో 74.36 శాతం, బిచ్కుంద మండలంలో 85.60 శాతం, బీర్కూర్ మండలంలో 77.30 శాతం, డొంగ్లీ మండలంలో 89.83 శాతం, జుక్కల్ మండలం (Jukkal Mandal)లో 75.82 శాతం, మద్నూర్ మండలంలో 78.23 శాతం, నస్రుల్లాబాద్ మండలం (Nasrullabad Mandal)లో 84.63 శాతం, పెద్దకొడప్గల్ మండలంలో 87.42 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 2 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది.
